డొనాల్డ్ ట్రంప్-జెలెన్ స్కీ ఫోన్ కాల్ లో ఎలాన్ మస్క్-ఇంతకంటే బిగ్ హింట్ ఉంటుందా ?
అమెరికాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచి మెజార్టీతో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రభుత్వంలో ఇవ్వాల్సిన పదవులపై కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో తనకు ఎన్నికల్లో అన్ని విధాలుగా అండగా నిలిచిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు ఏ పదవి ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో మస్క్ తో పాటు దేశ ప్రజలకు ట్రంప్ ఓ కీలక హింట్ ఇచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫోన్‌లో జరిగిన భేటీలో జాయిన్ కావాలంటూ ఎలాన్ మస్క్ కు ఆహ్వానం అందింది. ఇలా ఓ అంతర్జాతీయ వ్యవహారంలో చర్చల కోసం అధ్యక్షుడి పోన్ కాల్ లో జాయిన్ కావాలన్న ఆహ్వానం రావడంతో మస్క్ కు ఇదే పెద్ద ఆఫర్ అని భావిస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వంలో మస్క్ కీలక పాత్ర వహిస్తారని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా ఓ విదేశీ అధ్యక్షుడితో పోన్ కాల్ లో జాయిన్ చేయడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

డోనాల్డ్ ట్రంప్, వోలోడిమిర్ జెలెన్స్కీ ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఎలోన్ మస్క్ కూడా జాయిన్ అయ్యారు. అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్‌తో పాటు ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని లగ్జరీ రిసార్ట్ మార్-ఎ-లాగోలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో జెలె్ స్కీతో పాటు ఆ విషయంపైనా వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉంటుందా లేదా అన్న అంశాల్ని ట్రంప్, మస్క్ కలిసి జెలెన్ స్కీతో చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications