ట్విట్టర్ యూజర్లకు భారీ షాకిచ్చిన ఎలాన్ మస్క్

న్యూయార్క్: యూజర్లకు ట్విట్టర్ భారీ షాకిచ్చింది. వెరీఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు , అన్‌వెరీఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులు, కొత్త అకౌంట్లు తెరిచిన యూజర్లు రోజుకు 300 పోస్టులు మాత్రమే చూడవచ్చని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యూజర్లు ట్విట్టర్ ఓపెన్ కావడం లేదని అనుకుంటుండగా.. అసలు విషయం తెలిసి షాకవుతున్నారు. ఇదెక్కడి పాలసీలురా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు.

 Elon Musk Restricts Reading Limits On Twitter To Counter Data Scraping

కాగా, శనివారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోయారు. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తోంది. దీంతో ఎలాన్ మస్క్‌కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రెండు గంటలకుపైగా ఈ సమస్య నెలకొందని డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ పేర్కొంది. ట్విట్టర్ సేవలకు అంతరాయం నేపథ్యంలో ట్విట్టర్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కానీ, ఈ ఎర్రర్ వచ్చిన సంగతిని ట్విట్టర్ గుర్తించడం గానీ, సమస్యకు కారణంపై గానీ ట్విట్టర్ యాజమాన్యం వివరణ ఇవ్వలేదని కొందరు యూజర్లు అంటున్నారు.

తాము సాధ్యమైనంత త్వరగా అప్ డేట్ చేస్తామని , మరింత సమాచారం కోసం వెనక్కి వెళ్లి చెక్ చేసుకోండనే సమాచారం మాత్రమే వస్తోందిది. ఆన్ లైన్ సర్వీసుల అంతరాయంపై పని చేస్తున్న వెబ్ సైట్ 'డౌన్ డిటెక్టర్' ట్విట్టర్ లాగిన్‌లో 4000కి పైగా సమస్యలు తలెత్తాయని పేర్కొంది. దీనిపై వేలాది మంది యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. కొందరు మీమ్స్ కూడా అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, మస్క్ ట్వీట్ మాత్రం యూజర్లకు షాకిచ్చేదిగా ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+