గీ ట్విస్ట్ ఏందిరా బై
PM Modi ramp walk: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయనలా చేస్తారని కనీసం ఊహించనైనా ఊహించారా?, నిజంగా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ ఆయన ధరిస్తారు?, ఎలా ట్రెండ్ సెట్ చేయగలుగుతారు? అనేవి ఊహాజనిత ప్రశ్నలే. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి.
ఆ ఊహలకు ఓ రూపాన్ని ఇచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్. నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్ చేయడాన్ని ఏఐ ద్వారా చిత్రీకరించింది. నుదుటన తిలకం పెట్టుకుని, రంగురంగుల దుస్తులను ధరించిన మోదీ అలా దర్జాగా ర్యాంప్ వాక్ చేస్తోన్న ఊహలకు దృశ్య రూపాన్ని ఇచ్చింది.

ఒక్క మోదీ మాత్రమే కాదు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధినేత గ్ఝి జిన్ పింగ్, ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జొంగ్ ఉన్, కెనాడా, రష్యా ప్రధానమంత్రులు జస్టిన్ ట్రుడో, వ్లాదిమిర్ పుతిన్.. వంటి వివిధ దేశాధినేతలూ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో కనిపించారు.

పోప్ ఫ్రాన్సిస్ సైతం ఇందులో ఉన్నారు. ఈ వీడియోను ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్, ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తన అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియను ముంచెత్తాయి.
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024












Click it and Unblock the Notifications