SpaceX Starship: అంతరిక్షంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్-భూమిపైకి శకలాలు..!

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ అంతరిక్ష నౌక నిన్న టెక్సాస్ నుండి ఎగిరిన కొన్ని నిమిషాలకే అంతరిక్షంలోనే పేలిపోయింది. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లే కనిపించినా నిమిషాల వ్యవధిలో ఈ భారీ అంతరిక్ష నౌక గాల్లోనే పేలిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ సంస్థ చేపడుతున్న అంతరిక్ష ప్రయోగాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అంతే కాదు స్పేస్ ఎక్స్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ వచ్చి చేరింది.

స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ అంతరిక్షంలోనే పేలిపోవడంతో దీని ప్రభావం పలు దేశాలపై పడింది. అమెరికాతో పాటు బహమాస్, ఇతర దేశాలపై ఈ అంతరిక్ష నౌక శకలాలు పడ్డాయి. గాల్లో దూసుకొస్తున్న ఈ శకలాలతో విమానాల రాకపోకలు నిలిపేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఎఫ్ఏఏ వైమానిక రాకపోకలను నిలిపివేసింది. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ మార్స్ రాకెట్ కార్యక్రమానికి ఇది రెండో వరుస వైఫల్యం.

Elon Musk s SpaceX Starship exploded in Space debris affects air traffic

దక్షిణ ఫ్లోరిడా , బహామాస్ సమీపంలో సాయంత్రం ఆకాశం గుండా మండుతున్న శిధిలాలు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపించడంతో స్ధానికులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. వాస్తవానికి స్పేస్ ఎక్స్ ష్టార్ షిప్ ఇంజిన్లు నిలిపివేయబడి అనియంత్రితంగా తిరగడం ప్రారంభించిన కొద్దిసేపటికే స్టార్‌షిప్ అంతరిక్షంలో విడిపోయిందని స్పేస్‌ఎక్స్ మిషన్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది.

గతంలో స్పేస్ ఎక్స్ చేసిన ఏడో ప్రయోగం కూడా విఫలం కావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకుని ఉంటారని అంతా భావించారు. కానీ ఈసారి ప్రయోగం కూడా విఫలం కావడం మస్క్ సంస్థ సమర్థతపై సందేహాలు లేవనెత్తుతోంది. స్పేస్‌ఎక్స్ గతంలో చేసిన ప్రయోగాల్లో ప్రారంభ మిషన్ దశల్లో వరుసగా ప్రమాదాలు సంభవించాయి. ఈ సంవత్సరం మస్క్ వేగంగా పూర్తి చేయాలని భావించిన కార్యక్రమానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

విజయం మనం నేర్చుకున్న దాని నుండి వస్తుందని ఇలాంటి పరీక్షలు నిరూపిస్తాయని స్పేస్ ఎక్స్ ఈ వైఫ్యంపై ట్వీట్ చేసింది. ఈ స్టార్‌షిప్ ప్రయోగం విశ్వసనీయతను మెరుగుపరచడంలో తమకు సహాయపడుతుందని వెల్లడించింది. తాము ఎఫ్ఎఎ సమన్వయంతో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపింది. భవిష్యత్తులో స్టార్‌షిప్ విమాన పరీక్షలలో మెరుగుదల చేయడానికి దిద్దుబాటు చర్యలను అమలు చేస్తామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+