ఎలుకా మజాకా: విమానాన్ని నిలిపేసింది
లండన్: చిన్న చిట్టెలుక ఒక విమాన ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఎవ్వరికి చిక్కకుండా చుక్కలు చూపించింది. విమానంలోని క్యాబిన్ మొత్తం పరుగులు తీస్తూ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతే విమాన ప్రయాణం పూర్తిగా రద్దు చేశారు.
అధికారుల కథనం మేరకు - లండన్ లోని బర్మింగ్ హామ్ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానం ప్రయాణించవలసి ఉంది. ప్రయాణికులు విమానంలో కుర్చున్నారు. పైలెట్ క్యాబిన్‌లోకి వెళ్లాడు. అయితే ఆ సందర్బంలో విమానంలో ఎలుక ఉందని గుర్తించారు.

ఎలుకను పట్టుకోవడానికి ప్రయ్నతించారు. ప్రయాణికులు అందరిని కిందకు దించేశారు. అయితే ఎలుకను పట్టుకోవడం వారి తరం కాలేదు. విమాన ప్రయాణం రద్దు చేశారు. ప్రయాణికులు అందరికి ఒక హోటల్ లో బస ఏర్పాటు చేశారు.
రాత్రి బర్మింగ్ హామ్ లోనే ప్రయాణికులు కునుకు తీశారు. మరుసటి రోజు ఎలుకను పట్టుకున్న తరువాత విమానం దుబాయ్ బయలుదేరింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications