షాకింగ్ వీడియో: హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం, భయంతో ఫ్యాన్స్ అరుపులు
Recommended Video

రోమ్: ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఓ మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్ అధుపు తప్పింది. ఆ ఎస్కలేటర్ చాలా వేగంగా ముందుకు కదిలింది. దీంతో దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారంతా రష్యాకు చెందిన ఫుట్‌బుల్ అభిమానులుగా తెలుస్తోంది. ఓ అభిమాని కాలికి తీవ్రంగా గాయమైందని అధికారులు తెలిపారు.

హఠాత్తుగా వేగం పెరిగిన ఎస్కలేటర్
ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వీరు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ఆ ఎస్కలేటర్ మొదట నిర్దేశిత వేగంతో ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత హఠాత్తుగా చాలా వేగంగా కదిలింది. అప్పటికే ఎస్కలేటర్ పైన ఉన్న ఉన్న చాలామంది గాయపడ్డారు. ఎస్కలేటర్ వేగం ఒక్కసారిగా వేగం పెరగడంతో వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

పలువురికి గాయాలు
ఎస్కలేటర్ వేగానికి కింద వరకు వెళ్లిన చాలామంది ఒకరి మీద మరొకరు పడ్డారు. ఆ తర్వాత ఎస్కలేటర్‌ను ఆపేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎస్కలేటర్ పైన ఉన్న వారు కిందకు వెళ్లే వరకు ఒకరి పైన మరొకరు పడుతూ కనిపించారు. కొందరికి కాళ్ల పైన, మరికొందరికి మెడ పైన, ఇతర శరీర అవయవాల పైన గాయాలయ్యాయి.
భయంతో అరిచిన అభిమానులు
ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది. ఏఎస్ రోమా, సీఎస్‌కేఏ మాస్కో మధ్య మ్యాచ్ చూసేందుకు విదేశీయులు, స్థానికులు వెళ్లగా పియాజా డెల్లా రిపబ్లికా వద్ద ఉన్న మెట్రో స్టేషన్ వద్ద ఇది జరిగింది. ఎస్కలేటర్ ఒక్కసారిగా వేగం పెరగడంతో అందరూ భయాందోళనతో అరిచారు. కొందరు భయంతో పక్కనున్న రెయిలింగ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు.

వేగంగా వెళ్లడానికి కారణం ఇదే
ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. అంతకుముందు తప్ప తాగిన కొంతమంది ఆకతాయి అభిమానులు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని, అందుకే ఎస్కలేటర్‌లో ఏదో సమస్య వచ్చి, అది అదుపు తప్పి ఉండవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications