కుమార్తెకు చైనీస్ పేరు పెట్టిన ఫేస్‌బుక్ సీఈఓ

తన కుమార్తెకు చైనీస్ పేరు పెట్టుకుంటానని గతంలో ప్రకటించిన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్ అదే పని చేశాడు. చైనా నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా తన కుమార్తెకు 'చెన్ మింగ్ యూ' అనే పేరును పెట్టాడు. ఈ మేరకు జూకర్స్ బర్గ్ దంపతులు తన అధికారిక ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. చైనాలోని మాండరిన్‌లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్న ఈ జంట తమ కుమార్తె పేరును అధికారికంగా ప్రకటించారు. తన కుమార్తెకు పేరులోని విశేషాలను కూడా తెలియజేశాడు.

తల్లి ప్రిస్కిల్లా చెన్ నుండి వారసత్వంగా చెన్, రేపటి ప్రపంచపు ప్రకాశవంతమైన భవిష్యత్తును 'మింగ్ యూ' సూచిస్తుందని పేర్కొన్నారు. చైనీయుల పేర్లు ఒక సింబల్ ఆధారంగా ఉంటాయన్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందో పేరుపై ఆధారపడి ఉంటుందని చైనీయులు భావిస్తుంటారని పేర్కొన్నారు.

Facebook CEO Mark Zuckerberg and wife announce daughter's Chinese name

దీంతో పాటు చైనా ప్రజలకు లూనార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జుకర్ బర్గ్, తన భార్య ప్రిస్కిల్లా చెన్, చిన్నారి చెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా 2012లో పెళ్లి చేసుకున్న జూకర్స్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు గతేడాది నవంబర్‌లో మాక్స్ పుట్టింది.

గత ఏడాది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా జూకర్స్ బర్గ్ కుమార్తెకు చైనీస్ పేరు పెట్టుకోవాలనే జిన్‌ పింగ్ కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో జూకర్స్ బర్గ్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Happy Lunar New Year from Priscilla, Max and me! In the Year of the Monkey, I hope you and all your loved ones find happiness, health and good fortune.

Posted by Mark Zuckerberg on Saturday, February 6, 2016

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+