చీటీ సాయం: 25ఏళ్ల తర్వాత కలిసిన అన్నాచెల్లెలు

ఒట్టావా: కెనడాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న చీట సాయంతో 25ఏళ్ల తర్వాత ఓ అన్నాచెల్లెలు కలుసుకున్నారు. చీటీ సాయంతో సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ద్వారా తన సోదరి కోసం వెదికిన ఓ వ్యక్తి తన చెల్లెలిని కలిసి ఆనంద పరవశుడయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టొరంటోకు చెందిన మహిళ షైలో విల్సన్(25) ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటూ తన సోదరుడు మథ్యూ హ్యాండ్ ఫోర్డ్‌ను కనిపెట్టేందుకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కాగా, 1987 ఫిబ్రవరిలో గ్రేస్ హాస్పిటల్లో పుట్టిన ఆమె సోదరుడు మథ్యూను అప్పటికప్పుడే అతడి తల్లి వేరే వాళ్లకు దత్తత ఇచ్చేసింది.

గత డిసెంబర్‌లో ఫోర్డ్ కూడా ఫేస్‌బుక్ ఖాతా తెరిచి తన వాళ్ల కోసం వెదకడం ప్రారంభించాడు. కాగా, అతడిని దత్తత తీసుకున్న మహిళ.. 1996లో తాను సేకరించిన వివరాలను చిన్న చిట్టీలో రాసి ఇచ్చింది. అందులో ముగ్గురి వివరాలున్నాయి. అతని తల్లి పేరు మార్లిన్ లెవాస్సెర్‌. కాగా, తన తల్లి చివరి పేరు అలాగే ఉన్న వాండా లెవాస్సెర్ అనే ఓ మహిళను కలుసుకున్నాడు. ఆమె తన అక్క అని భావించి అక్కడే ఉండిపోయాడు.

Family Day 'miracle' in Calgary as Facebook unites woman with brother from Toronto

కొన్నిరోజుల కిందట ఆమె అనారోగ్యంతో మరణించింది. చనిపోయే ముందు, గత గురువారం విల్సన్ షేర్ చేసిన పోస్ట్‌ను ఫోర్డ్‌కు చూపించింది. తన దగ్గరున్న చిట్టీలో ఆ వివరాలను చూసి కన్ఫర్మ్ చేసుకుని ఫేస్‌బుక్‌లో సోదరికి తన వివరాలు చెప్పడం.. ఆ తర్వాత చెల్లెలు విల్సన్‌తో ఫోన్లో మాట్లాడటం జరిగిపోయాయి.

చెల్లెల్ని కలుసుకునేందుకు తూర్పు కెనడాలోని టొరంటో నుంచి కల్గారీకి గత శనివారం బయలుదేరాడు. నాలుగు రోజుల బాబుగా ఉన్నప్పుడు వేరే ఇంటికి దత్తత వెళ్లానని, ఇప్పుడు తన కుటుంబం మొత్తం చెల్లెలు విల్సనే అంటూ హ్యాండ్ ఫోర్డ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇటు తన అన్నయ్యను కలుకున్నందుకు విల్సన్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇదొక అద్భుతమైన ఘటన అని తెలిపింది. తమను కలిపిన ఫేస్‌బుక్‌కి ఆ అన్నాచెల్లెలు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+