డోర్ ఎదుట ఊహించని అతిథి.. భయంతో బిక్క చచ్చిపోయారు..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: నిద్రలో ఉన్నప్పుడు తలుపు చప్పుడైతే ఎవరికైనా సరే కాస్త చికాకు గానే అనిపిస్తుంది. కానీ అమాంతం తలుపును దబా దబా బాదితే.. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయి, ఏం జరగబోతుంది? విపరీతమైన టెన్షన్ కు లోనవడం ఖాయం.

తాజాగా దక్షిణ కరోలినాలోని ఒక కుటుంబం కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. పొద్దు పొద్దున్నే ఇంటి తలుపు బయట ఢమాల్ అని పెద్ద శబ్దమేదో వినిపించింది. శబ్దాలు అంతకంతకూ ఎక్కువవడంతో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. తొలుత దొంగల పనై ఉంటుందా? అని అనుమానించినా.. తీరా తలుపు తీసి చూస్తే గానీ తెలియలేదు.. అక్కడ ఉన్నది భారీ మొసలి అని.

family opens doors find heavy alligator

మొసలిని ఇంటి ఎదురుగా చూడగానే ఆ కుటుంబానికి గుండెజారినంత పనైపోయింది. 15అడుగుల ఎత్తున మొసలి పెద్దగా నోరు తెరిచి చూస్తోంటే బిక్క చచ్చిపోయారు. దాన్ని తరిమేయడానికి ఇంట్లోవాళ్లు ఎంత ప్రయత్నించినా.. వారివల్ల కాలేదు. బయట ఉన్న చొరబడి సోఫాలను, కుర్చీలను కిందపడేసి గందరగోళం సృష్టించింది.

చివరాఖరికి వన్యప్రాణి నిపుణులకు ఫోన్ చేయగా.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే ఎంతకీ లొంగకపోవడంతో.. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని చంపేశారు. ముసలి వయసు దాదాపు 60ఏళ్లు ఉంటుందని వన్యప్రాణి నిపుణులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It was Easter Sunday and a family woke up to an unexpected guest outside their house. No, it wasn't the Easter bunny.
Please Wait while comments are loading...