బోర్డు తిప్పేసిన అమెరికన్ బ్యాంక్: బంగారం, వెండి రేట్లు కుప్పకూలిన వేళ షాకింగ్ న్యూస్

నిన్నటి వరకూ ఆకాశానికి ఎగబాకుతూ కనిపించిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. పేకమేడలా నేలకు రాలాయి. బంగారం ధరల్లో మహా పతనం కనిపించింది. తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారి తీసింది.

ఈ పరిణామాల మధ్య అమెరికాలో ఓ బ్యాంక్ దివాళా తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇల్లినాయిస్ లోని బ్యాంక్ అది. మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్‌ తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. వ్యాపార లావాదేవీలను స్తంభింపజేసింది. ఈ విషయాన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) అధికారికంగా వెల్లడించింది. ఇలినాయిస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్.. ఈ బ్యాంక్ ను మూసివేసినట్లు వివరించింది.

FDIC Announces Illinois Metropolitan Capital Bank and Trust Closure First Bank Failure in this Year

ఈ ఏడాది అమెరికాలో కుప్పకూలిన తొలి బ్యాంక్ ఇదే. మెట్రోపాలిటన్ డిపాజిట్లన్నింటినీ స్వీకరించడానికి ఎఫ్‌డీఐసీ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించింది. ఫస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంక్‌తో కొనుగోలు, అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్‌ మూతపడినందున తక్షణమే ప్రత్యామ్నాయాన్ని అన్వేషించామని, ఫలితంగా డిపాజిటర్లు, కస్టమర్లకు అందే సేవల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ఎఫ్‌డీఐసీ వివరించింది.

ఇదే విషయాన్ని అటు ఇలినాయిస్ రెగ్యులేటర్ కూడా నిర్ధారించింది. డిపాజిట్లకు పూర్తి రక్షణను కల్పించినట్లు తెలిపింది. మూసివేత సమయంలో మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ లో సుమారు 261.1 మిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అందులోనివి మెజారిటీ నిరర్థక ఆస్తులే. అలాగే, మూలధన ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం దివాళా తీయడానికి కారణమైందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. దీని వల్ల డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సుమారు 19.7 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఎఫ్‌డీఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+