పైలట్ చివరి వీడియో.. కన్నీళ్లు పెట్టిస్తోంది భయ్యా..! మరణానికి కొన్ని క్షణాల ముందు..

యూఏఈలో జరిగిన దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమం విషాదంగా ముగిసింది. ఎయిర్ షో లో భాగంగా విన్యాసాలు చేస్తూ భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అధికారికంగా ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎన్ క్వైరీకి ఆదేశించినట్లు IAF స్పష్టం చేసింది.

Final Moments Captured Wing Commander Namansh Syal s Last Smile in Viral Tejas Crash Video

అయితే ప్రమాదానికి ముందు పైలట్, వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దుబాయ్ ఎయిర్ షో లో ఈ వీడియోను తీశారు. ఈ వీడియోలో వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్(డిఫెన్స్) సంజయ్ సేత్, యూఏఈలో బారత అధికారి దీపక్ మిట్టల్, గల్ఫ్ లో భారత్ కు చెందిన అడిషినల్ సెక్రటరీ అసీమ్ మహాజన్.. ఇతర పైలట్స్ తో కలిసి ఆయన గ్రూప్ ఫోటో తీసుకుంటున్న వీడియోలు, చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

34 ఏళ్ల వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్.. హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా నగ్రోటా గ్రామానికి చెందినవారు. హిమాచల్ లోని స్థానిక వార్తల ప్రకారం.. సయాల్ సతీమణి కూడా IAF లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సయాల్ తండ్రి సైతం మాజీ IAF ఆఫీసర్ అని స్పష్టం అవుతోంది. ఇక అతడి అస్థికలు ఆదివారం భారత్ కు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వీందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం.. ఓ ధైర్యవంతమైన పైలట్ ను కోల్పోయిందని అన్నారు. పైలట్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇక ఈ ఘటనకు సంబంధించి.. పైలట్ సయాల్ నెగిటివ్ జీ టర్న్ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. పైలట్ కు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు నెగటివ్ జీ వాడతారని సమాచారం. ఇక తేజర్ ఫైటర్ జెట్స్ కు ఎంతో సమర్థవంతమైన ఫైటర్ జెట్స్ అని పేరుంది. గత 24 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే ఇవి కుప్పకూలిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+