బీజింగ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

బీజింగ్: చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని నగరం బీజింగ్‌లోని ఆస్పత్రి భవనంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటల సమయంలో ఇక్కడి చాంగ్‌ఫెంగ్ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, సిబ్బంది మొత్తం 71 మంది రోగులను బయటికి తీసుకొచ్చారు. వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. మరికొందరు తాళ్ల సహయంతో కిందకు దూకారు.

 Fire accident

ఈ క్రమంలోనే 21 మంది మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటన చాలా విషాదకరం. పలువురు భవనం వెలుపల అమర్చిన ఏసీ యూనిట్లపై నిలబడి కనిపించారు. వారిలో కొందరు కిందికి దూకారు అని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.


చైనాలోని ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+