బుర్జ్ ఖలీఫా ఆవరణలో మంటలు, నిలిచిన ట్రాఫిక్
ప్రపంచంలో అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖలీఫా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో ఆదివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి.
దుబాయి: ప్రపంచంలో అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖలీఫా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో ఆదివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి.
వెంటనే సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో మంటలు అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

దట్టంగా పొగలు వ్యాపిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మంటలు వ్యాపించిన భవనం దుబాయ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ఎమ్మార్‌కి చెందిందిగా అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications