వైరల్ వీడియో: రెండో రోజే తీసేశారు.. భారత యువతి ఎమోషనల్ పోస్టు
విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. భారత్ లో అయితే వేలల్లో సంపాదించుకోవచ్చు.. అదే విదేశాల్లో అయితే లక్షల్లో సంపాదించుకోవచ్చని భావిస్తారు. అందుకే ఏటా భారత్ నుంచి లక్షల మంది విదేశాలకు పయనమవుతుంటారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత చదువులకు వెళ్తుంటారు. అయితే ఇలానే జర్మనీ వెళ్లిన ఓ భారత యువతికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్న్ షిప్ లో జాయిన్ అయిన రెండో రోజే తనను ఉద్యోగం నుంచి తీసేశారని జర్మనీలో భారత యువతి ఎమోషనల్ అయింది. ఆమె అప్పటికే అనేక రౌండ్స్ ఇంటర్వ్యూలను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ టీమ్ కు సరిపడ అనుభవం లేకపోవడం, సమయపాలన లేకపోవడం కారణంగా చూపి తనను తెలిగించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
భారత్ కు చెందిన కాజల్ టెక్వానీ తన ఇన్ స్టా వేదికగా కీలక పోస్టు చేసింది. తనను జర్మనీలో ఇంటర్న్ షిప్ జాయిన్ అయిన రెండో రోజే తీసేశారని అందులో పేర్కొంది. తాను స్టార్టప్ రోల్ కోసం బెర్లిన్ నుంచి మునిచ్ కు మారిపోయానని తెలిపింది. కంపెనీ తనకు బాగానే వసతి సదుపాయం కల్పించిందని కానీ తనకు ఫైర్ లేదని చూపుతూ, తన యాట్టిట్యుడ్ ను కించపరుస్తూ తనపై ఫీడ్ బ్యాక్ ఇచ్చారని పేర్కొంది. ఈ మేరకు తనకు రూడ్ మెసేజ్ వచ్చినట్లు పేర్కొంది. కొత్త ఇంటర్న్ షిప్ కోసం నగరాలు మారి.. రెండో రోజే టెర్మినేట్ కావడం ఒక్కసారి ఊహించుకోండి.. నాకు ఇలాగే జరిగింది అని కాజల్ తన ఇన్ స్టా లో పేర్కొంది.

ఆఫీస్ లో మొదటిరోజు సాఫీగానే సాగిందని.. రెండో రోజు కంటి సమస్య కారణంగా కాస్త లేట్ గా వచ్చానని తెలిపింది. అప్పుడు వాళ్లు తనకు రెండు సమాధానాలు ఇచ్చారని ఒకటి టీమ్ కు ఫిట్ కాదని.. రెండు మరింత అనుభవం ఉన్న ఉద్యోగి అవసరం అని.. చెప్పారని కాజల్ పేర్కొంది. ఇంటర్న్ షిప్ కోసం నగరాలు మారేవాళ్లు ఆలోచించుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications