కమలా.. నువ్వు చావబోతున్నావ్ -యూఎస్ ఉపాధ్యక్షురాలి హత్యకు పన్నాగం -ఫ్లోరిడా నర్సు అరెస్ట్
జోడుగుర్రాలైన జోబైడెన్-కమల హ్యారిస్ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయింది. గద్దెనెక్కుతూనే 100 రోజుల ప్లాన్ ప్రకటించిన ఆ ఇద్దరూ నిర్దేశిత లక్ష్యాలను సాధించారనడానికి గుర్తుగా పలు సర్వేల్లో మెరుగైన అప్రూవల్స్ పొందారు. కొవిడ్ పై పోరాటంలో బిజీగా ఉన్న కమలకు అనూహ్య అనుభవం ఎదురైంది..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్‌గా కమల రికార్డులకు ఎక్కగా, ఆమెను చంపుతానని బెదిరించిన నర్సు కూడా నల్లజాతీయురాలే కావడం గమనార్హం.
కమలా హారిస్‌ను చంపుతానని, శారీరక దాడికి పాల్పడతానంటూ బెదిరించిన ఆ నర్సును ఫ్లోరిడాకు చెందిన నివియానె పెటిట్ ఫెల్ప్స్ అని, ఉద్దేశపూర్వకంగా పదేపదే బెదిరింపులకు పాల్పడిన ఆమెను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేసిందని అధికారిక ప్రకటన వెలువడింది.

నిందితురాలైన నివియానె 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్‌లో పనిచేస్తోంది. జైలులో ఉన్న తన భర్తకు ఫెల్ప్స్ జేపే (ఖైదీలతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతించే కంప్యూటర్ అప్లికేషన్) ద్వారా పలు వీడియోలు పంపింది. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ తదితరులపై ద్వేషంతో ఊగిపోతుండడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు, కమలను చంపుతానని ఫెల్ప్స్ మరో వీడియోలో చెప్పుకొచ్చింది. ''కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీ రోజులు దగ్గరపడ్డాయి'' అని ఇంకో వీడియోలో హెచ్చరించింది.
ఫిబ్రవరి 18న పంపిన మరో వీడియోలో.. ''నేను తుపాకి రేంజ్‌లోకి వెళ్లబోతున్నా. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నువ్వు చనిపోబోతున్నావ్. రాసిపెట్టుకో. ఈ రోజుకు సరిగ్గా 50 రోజులు'' అని పేర్కొంది. దర్యాప్తు అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫొటోలో ఫెల్ప్స్ షూటింగ్ రేంజ్‌లో తుపాకి పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఫిబ్రవరిలోనే ఆమె ఆయుధ లైసెన్స్ తీసుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications