Flydubai: "కూల్చేయాలనుకున్నా-చావంటే భయం లేదు?"-దర్యాప్తులో కో పైలట్..!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చేసేందుకు జరిగిన కుట్ర క్రమంగా దర్యాప్తులో బయటికి వస్తోంది. ఈ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒమన్ కు చెందిన కో-పైలట్ (Co-Pilot) హమామ్ అల్-హమ్మామీ .. ప్రధాన పైలట్ అయిన భారతీయుడు స్మిత్ మచ్చర్ పై దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే స్మిత్ వీరోచిత పోరాటంతో కో పైలట్ ను అడ్డుకోవడంతో విమానంలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి.

స్మిత్ కు ఇజ్రాయెల్‌ అత్యున్నత గౌరవం! మోదీతో పాటు స్పెషల్ ఇన్విటేషన్..
స్మిత్ కు ఇజ్రాయెల్‌ అత్యున్నత గౌరవం! మోదీతో పాటు స్పెషల్ ఇన్విటేషన్..

ఈ నేపథ్యంలో ప్రధాన పైలట్ స్మిత్ మచ్చర్.. కాక్ పిట్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలట్ ను బంధించారు. మరో ఇద్దరు జూనియర్ పైలట్లు చాకచక్యంగా ఈ విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఈ ఘటనపై సౌదీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో ఫ్లై దుబాయ్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేయాలని అనుకున్నానని, తనకు చావు అంటే అస్సలు భయం లేదని కో పైలట్ హమామ్ అల్-హమ్మామీ విచారణలో అంగీకరించాడు. సెప్టెంబర్ 30న టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదూబై విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన తర్వాత సౌదీ అరేబియా దర్యాప్తు అధికారుల వద్ద అతను ఈ విషయాలను వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

Flydubai Co-Pilot Admits He Wanted to Crash Plane Says He Was Not Afraid of Death
కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!
కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!

దీంతో తీవ్రవాద భావజాలం ఉన్న ఒక వ్యక్తి ఏకంగా విమానం కాక్‌పిట్‌లోకి ఎలా ప్రవేశించగలిగాడనే దానిపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటన తర్వాత 29 ఏళ్ల ఒమన్ జాతీయుడైన హమ్మామీ కేసు విమానయాన రంగంలో భద్రతా లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. గతంలో అతను ఒమన్ ఎయిర్‌లో పనిచేస్తున్న సమయంలో తీవ్రవాద వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నట్లు గుర్తించి, ఒమన్ ప్రభుత్వం అతనిపై విమానాలు నడపకుండా నిషేధం విధించింది. ఆ తర్వాత అతడికి డీ-రాడికలైజేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ ఆఫీస్ పనికి పరిమితం చేశారు. అయితే, ఒమన్‌ నుంచి ఎలాంటి నేపథ్య సమాచారం లేదా ముందస్తు వెరిఫికేషన్ వివరాలను సేకరించకుండానే 2026 ఫిబ్రవరిలో ఫ్లై దుబాయ్ సంస్థ అతడిని నేరుగా కో-పైలట్ ఉద్యోగంలోకి తీసుకోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒమన్, సిరియా నేపథ్యం ఉన్న హమామీ సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సిరియా అంతర్యుద్ధ సమయంలో అక్కడి తీవ్రవాద గ్రూపుల ప్రభావం అతనిపై పడిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+