బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పరిస్థితి అత్యంత విషమం!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు 80 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఆమె ఈ సంవత్సరమే బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని బీఎన్పీ పార్టీ శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఆరోగ్యం అత్యంత విషమం
ఢాకాలో విలేకరులతో బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, వైద్యులు నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. "మీ అందరికీ తెలుసు, మా నాయకురాలు బేగం ఖలీదా జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని గత రాత్రి వైద్యులు తెలిపారు" అని ఆయన అన్నారు.

Former Bangladesh PM Khaleda Zia Critical Admitted to Dhaka Hospital

ఖలీదా జియాకు ఏమైంది?
నవంబర్ 23 రాత్రి ఖలీదా జియాకు గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించిన మెడికల్ బోర్డు సలహా మేరకు ఆమెను ఢాకాలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ప్రస్తుతం న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు. ఆసుపత్రిలోని కొరోనరీ కేర్ యూనిట్‌లో విదేశీ, స్థానిక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

లండన్ నుంచి తిరిగొచ్చిన ఖలీదా జియా
ఖలీదా జియా 2025 మే నెలలో లండన్‌లో4 నెలల పాటు వైద్య చికిత్స తీసుకున్న తర్వాత ఢాకాకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆమె తిరిగి రావడం "దేశంలో ప్రజాస్వామ్య మార్పు ప్రక్రియకు చాలా ముఖ్యమైనది" అని బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఖలీదా జియాకు 2018 అక్టోబర్ 29న జియా చారిటబుల్ ట్రస్ట్ అవినీతి కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష , 10 లక్షల టాకాల జరిమానా విధించబడింది. ఆమెను పాత ఢాకా సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే 2024 ఆగస్టు 5న విద్యార్థి నేతృత్వంలోని ప్రజా ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఆమె విడుదలయ్యారు. ఆ తర్వాత కోర్టు కూడా ఆమెకు విధించిన శిక్షలను రద్దు చేసింది.

తారిక్ రెహ్మాన్ రాకపై చర్చ
ఇదిలా ఉండగా.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ (ఖలీదా జియా కుమారుడు) స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశంపై కూడా చర్చ ఊపందుకుంది. ప్రధాన కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలైన తర్వాత ఆయనకు చట్టపరమైన అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికల కార్యక్రమం ప్రకటించిన వెంటనే ఆయన స్వదేశానికి తిరిగి రావచ్చని స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+