Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు ఏడేళ్ల జైలుశిక్ష..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరింత కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే తోహాఖానా కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మారిన ఆయనకు ఇవాళ స్ధానిక కోర్టు మరో షాకిచ్చింది. వివాహ చట్టాల ఉల్లంఘన కేసులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన మొదటి భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఉల్లంఘించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు బుష్రా మొదటి భర్త దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

2018లో ఇమ్రాన్ ఖాన్- బుష్రా బీబీ చేసుకున్న వివాహం చెల్లదని ఇస్లామాబాద్ కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. ఒక పెళ్లికీ, మరో పెళ్లికీ మధ్య తప్పనిసరిగా ఇవ్వాల్సిన గ్యాప్ ఇవ్వకపోవడం ద్వారా వీరు వివాహ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కోర్టు ఇప్పటికే నిర్ధారించింది. ఈ కేసులో ఇవాళ కోర్టు శిక్షను ఖరారు చేసింది. దీంతో పాటు జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.

former pakistan pm imran khan and wife bushra bibi get 7 years jail in marriage act violation case

తన మాజీ భార్య బుష్రా, ఇమ్రాన్ ఖాన్ వివాహానికి ముందు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, దీనికి రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించే అవకాశం ఉందని ఆమె మాజీ భర్త మనేకా పిటిషన్లో ఆరోపించాడు. దీంతో కోర్టు ఆయన వాదనతో ఏకీభవించింది.దీంతో ఈ వారంలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వెలువడిన మూడో తీర్పుగా ఇది మారింది. ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు కీలక సమయంలో ఈ తీర్పులు రావడంతో ఇమ్రాన్ ఖాన్ పోటీకి దూరమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+