నిన్న హఫీజ్ సయీద్, నేడు పాక్ మాజీ ప్రధాని అరెస్ట్!
లాహోర్: పాకిస్తాన్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే ఆ దేశ మాజీ ప్రధాని కటకటాల వెనక్కి వెళ్లారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖకన్ అబ్బాసీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అవినీతి కేసులో అబ్బాసీని అరెస్ట్ చేసినట్లు నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో (ఎన్ఏబీ) విభాగం అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఓ మాజీ ప్రధాని అరెస్టు కావడం ఇది రెండోసారి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి చెందిన అబ్బాసీ 2017-18 మధ్యకాలంలో అబ్బాసీ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి పీఎంఎల్ నాయకుడు షెహబాజ్ షరీఫ్‌తో కలిసి కారులో రావల్పిండి నుంచి లాహోర్ వెళ్తుండగా అబ్బాసీని స్థానిక టోల్‌ప్లాజా వద్ద ఎన్ఏబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) టెర్మినల్ ఏర్పాటు విషయంలో అబ్బాసీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి.

ఈ కేసులో ఆయన ఇదివరకే ఎన్ఏబీ నుంచి సమన్లను అందుకున్నారు కూడా. 2200 కోట్ల రూపాయల విలువ చేసే ఎల్ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు విషయంలో అబ్బాసీ అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. తాను షేర్ హోల్డర్‌గా ఉన్న ఓ సంస్థకు ఈ టెర్మినల్ నిర్మాణ పనులను టెండర్లను అప్పగించారనే ఆరోపణలను అబ్బాసీ ఎదుర్కొంటున్నారు.

అబ్బాసీ అరెస్టును పీఎంఎల్-నవాజ్ నేతలు తప్పుపడుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
میرے ہموطنو! آپ کے ووٹ سے منتخب ہونے والا ایک اور وزیر اعظم گرفتار ! جو آپ کے ووٹ سے آئے گا، کیا یہی لا قانونیت، توہین اور ناانصافی اس کا مقدر بنے گی؟ pic.twitter.com/iKvx47rjrR
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) July 18, 2019
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications