ఎన్నికల వేళ అమెరికాలో అనూహ్యం - ట్రంప్ అనుంగుడు స్టీవ్ బానన్ అరెస్ట్ - గోడ నిధుల్లో గోల్‌మాల్

అధ్యక్ష ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అమెరికాలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుంగుడు, వైట్ హౌజ్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ గురువారం అరెస్టయ్యారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఆన్ లైన్ ద్వారా సేకరించిన నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు తేలడంతో బానన్ పై మోసం కేసు నమోదైంది.

తన పదవీ కాలంలో ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో 'మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం' కూడా ఒకటి. భారీ ఖర్చుతో కూడుకున్న ఆ పని వద్దంటూ చాలా మంది వ్యతిరేకించగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇంకొందరు ముందుకొచ్చారు. అలా స్టీవ్ బానన్ ఆధ్వర్యంలో ''బిల్డ్ ది వాల్''పేరుతో ఆన్ లైన్ ద్వారా నిధుల సేకరణ చేపట్టారు. గోడ నిర్మాణం కోసం వేలాది మంది లక్షలాది డాలర్లను విరాళాలుగా ఇచ్చారు. కానీ..

 Former Trump adviser Steve Bannon charged with fraud over Mexico wall funds

''బిల్డ్ ది వాల్'' పేరుతో స్టీవ్ బానన్ వసూలు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మొత్తం 25 మిలియన్ డాలర్లు వసూలు కాగా, అందులో నుంచి మెజార్టీ నిధులలను బానన్, మరో ముగ్గురు వ్యక్తులు పక్కదోవపట్టించారని, తప్పుడు పత్రాలు సృష్టించారని డబ్బులు మింగేశారని, తద్వారా వేల మంది దాతలను మోసం చేశారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

2016నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు అన్నీ తానై నడిపించిన స్టీవ్ బానన్.. తర్వాతి కాలంలో వైట్ హౌజ్ లో ఉన్నత పదవి చేపట్టారు. ఇస్లామిక్ దేశాలపై ట్రావెల్ బ్యాన్, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలన్న ఐడియాలు బానన్ వేనని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, కాల క్రమంలో బానన్ తీవ్ర జాతీయవాద వైఖరితో ట్రంప్ ఇబ్బందులు పడ్డారని, అందుకే వైట్ హౌజ్ సలహాదారు పదవి నుంచి తప్పించారని, అయితే ఇద్దరి మధ్య సంబంధాలు మాత్రం స్నేహపూర్వకంగానే కొనసాగుతున్నాయని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. ఎన్నికల వేళ బానన్ అరెస్టును ట్రంప్ ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకునే అవకాశాలు లేకపోలేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+