పార్టీ స్థాపించి ఏడాది... అంతలోనే అధ్యక్ష పదవి... నెపోలియన్ తర్వాత ఈయనే...

ఫ్రాన్స్ లో ఎన్ మార్చ్‌ ఇప్పుడొక సంచలనం. ఈ పార్టీ పుట్టింది కూడా ఏడాది క్రిత‌మే. 2016 మార్చి నెల‌లో ఈ పార్టీని స్థాపించారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్. ఓ ఉద్య‌మంగా పుట్టిన పార్టీ కేవ‌లం ఏడాదిలోనే ఆశ్చర్యకర

పారిస్: ఫ్రాన్స్ లో ఎన్ మార్చ్‌ ఇప్పుడొక సంచలనం. ఈ పార్టీ పుట్టింది కూడా ఏడాది క్రిత‌మే. 2016 మార్చి నెల‌లో ఈ పార్టీని స్థాపించారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్. ఓ ఉద్య‌మంగా పుట్టిన పార్టీ కేవ‌లం ఏడాదిలోనే ఆశ్చర్యకర రీతిలో ప్ర‌భుత్వ పాల‌న‌ను చేజిక్కించుకుంది.

తాజాగా జ‌రిగిన ఫ్రాన్స్ పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో మాక్రాన్ 66.06 శాతం ఓట్ల‌తో విజయం సాధించారు. దీంతో మాక్రాన్ ఫ్రాన్స్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 39 ఏళ్ల వ‌య‌సులోనే దేశాధ్య‌క్ష ప‌ద‌విని అల‌క‌రించ‌నున్నారు.

macron

ఫ్రాన్స్ చ‌క్ర‌వ‌ర్తి నెపోలియ‌న్ త‌ర్వాత ఆ దేశాన్ని ఏలిన అతిపిన్న వ‌య‌స్కుడిగా కూడా మాక్రాన్ రికార్డు క్రియేట్ చేశారు. తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన సోష‌లిస్టు, నేష‌న‌లిస్టు పార్టీలు దారుణంగా ఓట‌మి చ‌విచూశాయి.

బూర్జువా డాక్ట‌ర్ల కుటుంబంలో పుట్టి...

మాక్రాన్ 1977లో బూర్జువా డాక్ట‌ర్ల కుటుంబంలో జ‌న్మించారు. ఏమియ‌న్స్ న‌గ‌రంలో ఆయ‌న పుట్టారు. 12 ఏళ్ల వ‌య‌సులో రోమ‌న్ క్యాథ‌లిక్‌గా మారారు. టీనేజ్‌లోనే మాక్రాన్ క‌విత్వం, న‌వ‌ల‌లు రాశారు. తాను చ‌దువుతున్న స్కూళ్లో డ్రామా క్లాసుల్లో చేరాడు. అక్క‌డే టీచ‌ర్‌ బ్రిగ్గెటి ట్రోగ్‌నెక్స్ తో ప‌రిచ‌య‌మైంది.

వాళ్ల ఇద్ద‌రి మ‌ధ్య 24 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. అయినా కానీ ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌య‌ణ బంధం కొన‌సాగింది. మాక్రాన్ తల్లిదండ్రులు వాళ్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అప్పుడు మాక్రాన్ ఉన్న‌త చ‌దువుల కోసం పారిస్ వెళ్లారు. కానీ మ‌ళ్లీ సొంత ఊరికి తిరిగివ‌చ్చిన మాక్రాన్ 2007లో త‌న టీచ‌ర్ బ్రిగ్గెట్‌ను పెళ్లి చేసుకున్నారు.

ఇదీ రాజకీయ జీవితం...

దేశాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ్డ మాక్రాన్ త‌న టీచర్‌తో ఉన్న అనుబంధం బాగా ప‌నిచేసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాళ్ల మ‌ధ్య ఉన్న బంధాన్ని గ‌ర్వంగా చెప్పుకున్నారు. మొద‌ట మాక్రాన్ త‌న రాజ‌కీయ జీవితాన్ని ఓ అధికారిగా ప్రారంభించారు. ఆ త‌ర్వాత బ్యాంక‌ర్ అయ్యారు. 2012లో ఫ్రాంకోయిస్ హోలాండ్‌కు చెందిన సోష‌లిస్టు పార్టీలో డిప్యూటీగా చేరారు. 2014 నుంచి హోలాండే ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రిగా రెండేళ్లు చేశారు.

కానీ ఈ స‌మ‌యంలోనే ఫ్రాన్స్‌లో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఉద్యోగం కోసం ఉద్య‌మాలు మొద‌ల‌య్యాయి. ఆర్థిక సూత్రాల‌ను స‌ర‌ళీక‌రించాల‌ని మాక్రాన్ ప్ర‌భుత్వానికి సూచించారు. దీని కోసం ఓ చ‌ట్టాన్ని ఆయ‌న త‌యారు చేశారు. కానీ మాక్రాన్ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌ధాని ఆదేశాల‌తో అడ్డుకున్నారు.

కొత్త పార్టీ పెట్టి... ఏడాదికే...

త‌న ఆర్థిక సూత్రాల‌కు అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డంతో మాక్రాన్ సోష‌లిస్టు పార్టీకి గుడ్‌బై చెప్పారు. హోలాండే పార్టీని వీడిన మాక్రాన్ ఆ త‌ర్వాత ఉద్యమం చేప‌ట్టారు. 2016లో కొత్త పార్టీని స్థాపించారు. త‌న పార్టీకి 'ఎన్ మార్చ్' అని పేరు పెట్టారు. ఇది అందరినీ క‌లుపుకునిపోయే ప్ర‌గ‌తిశీల పార్టీ అని మాక్రాన్ అన్నారు.

కేవ‌లం ఒక్క ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో చ‌క్రం తిప్పేశారు. ప్ర‌ధాన సోష‌లిస్టు, నేష‌లిస్టు పార్టీల‌కు చెక్ పెట్టేశారు మాక్రాన్‌. 39 ఏళ్ల మాక్రాన్ మూడేళ్ల క్రితం అస‌లు ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీచేయ‌లేదు. కానీ త‌క్కువ స‌మ‌యంలోనే కీల‌క నేత‌గా ఆవిర్భ‌వించారు. యురోపియ‌న్ యూనియ‌న్ విచ్ఛిన్నం కారాదు అన్న‌ది మాక్రాన్ సిద్ధాంతం. ప్రేమ‌, విన‌యంతో దేశాన్ని పాలిస్తాన‌ని విక్టరీ సందేశం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+