ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగ్సల్ టైటిల్ నోవాక్ జకోవిచ్ కైవసం: ఖాతాలో 19వది

ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదో సీడ్ సిట్సిపాస్‌పై జకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయం సాధించి టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయంతో జకోవిచ్ 19 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది. తాజా గెలుపుతో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి ఆటగాడిగా జకోవిచ్ రికార్డు సృష్టించాడు.

 French Open 2021: Novak Djokovic beats Stefanos Tsitsipas to clinch 19th Grand Slam title

ఇది ఇలా ఉండగా, ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల విభాగంలో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా చరిత్ర సృష్టించింది. శనివారం ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిచికోవా.. ఆదివారం డబుల్స్‌ విజేతగా అవతరించింది. తన దేశానికే చెందిన కేథరీనా సినియాకోవాతో జత కట్టిన క్రిచికోవా.. ఫైనల్లో ఇగా స్వియాటెక్‌, బెతానీ మాటెక్‌ సాండ్స్‌ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది. దీంతో 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకే ఏడాది సింగల్స్‌, డబుల్స్‌ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఫీట్‌ను చివరిసారిగా 2000లో మేరీ పియర్స్‌ సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+