అసలు ఏంటీ Ghibli style..? మీ ఫొటోను గిబ్లి స్టైల్ లోకి ఎలా మార్చుకోవాలి..?
ప్రస్తుతం ఎక్కడచూసినా గిబ్లి స్టైల్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఆఖరికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సైతం ఈ స్టైల్ ఫొటోలను మారుస్తూ సంబరపడిపోతున్నారు. ఈ ఫిల్టర్ ను ఉపయోగించి ఆయా సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఏఐ సంస్థ చాట్ జీపీటీ ప్రవేశ పెట్టిన ఈ యానిమేషన్ ఇమేజ్ ఫీచర్ నెట్టింట ఓ ఊపుఊపుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం తన ఫొటోలను గిబ్లి యానిమేషన్ లోకి మార్చి ఎక్స్ ద్వారా షేర్ చేశారు. మరి ఏంటీ గిబ్లి స్టైల్. ఇప్పుడు తెలుసుకుందాం..
ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీ ప్రశేశపెట్టిన యానిమేషన్ ఇమేజ్ ఫీచర్ Ghibli style. చాట్ జీపీటీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఇది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు గిబ్లి స్టైల్ ఇమేజ్ లను పొందవచ్చు. అంతేకాక ఎలాన్ మస్క్ గ్రోక్ లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంది. చాట్ జీపీటీని ఉపయోగించి ఏఐ జనరేటెడ్ గిబ్లి చిత్రాలను ఉచితంగా ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం..
ముందుగా chat.openai.com ను ఓపెన్ చేసి.. మీ OpenAI ఖాతా వివరాలతో లాగిన్ అవ్వండి. కొత్త చాట్ ప్రారంభించండి. లాగిన్ అయిన తర్వాత, న్యూ చాట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ ను అప్ లోడ్ చేయడం లేదా మీకు కావాల్సిన ఇమేజ్ ను అక్కడ వివరించాలి. మీ ఇమేజ్ ప్రాంప్ట్ ను నమోదు చేయండి.

మెసేజ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మీరు రూపొందించాలనుకుంటున్న చిత్రం కోసం వివరణాత్మక ప్రాంప్ట్‌ను టైప్ చేయాలి. show me in studio ghibli style అని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ప్రాంప్ట్‌ను సమర్పించడానికి జనరేట్ ది ఇమేజ్ బటన్ క్లిక్ చేయండి. చాట్ జీపీటీ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది. మీరు కోరుకున్న చిత్రం వస్తుంది. అప్పుడు వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఆ ఇమేజ్ ను మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు.
ఫొటోను అప్‌లోడ్ చేయడం.. దాన్ని ఎలా మార్చాలో వివరణ ఇవ్వడం ద్వారా.. వినియోగదారులు సెకన్లలో వారి సొంత ప్రత్యేకమైన కళాకృతిని రూపొందించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం చాట్ జీపీటీ ప్లస్, ప్రో, టీమ్ తదితర సబ్ స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. ఏఐ సృష్టించిన చిత్రాలకు ఉన్న అధిక డిమాండ్ దృష్ట్యా వినియోగదారులను ఉచితంగా ఈ ఫీచర్‌ను విడుదల చేయడంలో ఆలస్యం అయిందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల అన్నారు.












Click it and Unblock the Notifications