ఏంటీ చెత్త పనులు ? దొడ్డిదారిలో ట్రంప్ నోబెల్ పై విమర్శల వెల్లువ..!

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్ని నమ్మేవారే కరువవుతున్నారు. ముఖ్యంగా ప్రతీ యుద్ధంలోకి దూరి శాంతిదూతలా మధ్యవర్తిత్వానికి సిద్దమైపోతున్న ట్రంప్ జోక్యంపై ఆయా దేశాలే మండిపడుతున్నాయి. కానీ ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఇన్ని యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి ఇచ్చి తీరాలంటూ ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఈ ఎత్తులేవీ ఫలించకపోవడంతో ఇప్పటికే నోబెల్ అందుకున్న వెనెజులా ప్రతిపక్ష నాయకురాలిని పిలిపించుకుని ఆమె నుంచి నోబెల్ తీసేసుకున్నారు.

వెనెజులా ప్రతిపక్ష నేత నుంచి ఇలా ట్రంప్ నోబెల్ తీసుకోవడంపై నార్వేకు చెందిన నోబెల్ అవార్డు కమిటీ తీవ్రంగా స్పందించింది. నోబెల్ బహుమతి ఇలా ఒకరిది ఇంకొకరికి ఇవ్వడం చెల్లదని తేల్చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోబెల్ స్వదేశం నార్వేలోనూ ట్రంప్ తీరుపై ప్రజాప్రతినిధులు, సాధారణ జనం మండిపడుతున్నారు. ఇతరుల అవార్డులతో తనను తాను అలంకరించుకునే క్లాసిక్ బలిపశువు ట్రంప్ అని నార్వే ఎంపీ ట్రైగ్వే స్లాగ్స్‌వోల్డ్ వేదమ్ అభివర్ణించారు. ఇతర దేశాల్లోనూ రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు ట్రంప్ పై ఫైర్ అవుతున్నారు.

Global Fury Erupts Over Machado s Nobel Snub to Trump

ట్రంప్ ఇలా దొడ్డిదారిన నోబెల్ బహుమతి తెచ్చుకోవడంపై ఇంటర్నెట్ లోనూ నెటిజన్లు మండిపడుతున్నారు. రష్యాకు మాజీ అమెరికా రాయబారి మైఖేల్ మెక్‌ఫాల్ .. ట్రంప్ వేరొకరి బహుమతిని స్వీకరించడం పట్ల ఎలా ఇబ్బందిగా అనిపించడం లేదో తనకు అర్థం కాలేదన్నారు. మీరు మీ నోబెల్ శాంతి బహుమతిని డోనాల్డ్ ట్రంప్ లాంటి వారికి ఇవ్వగలిగితే మీరు అసలు ఈ అవార్డుకు అర్హులు కాదంటూ వెనెజులా విపక్ష నేతకు కూడా నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి ఇతరులకు బదిలీ చేసిన తర్వాత అది బహుమతి కంటే జోక్ గా మారిపోతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+