viral video:అగ్రరాజ్యంలో జాత్యాంహకార దాడి, ఇండియన్ ఉమెన్‌పై.. మొబైల్ లాక్కొని మరీ

అమెరికాలో వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉంది. స్థానికుల జాత్యాంహకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మెక్సికన్ యువతీ రెచ్చిపోయారు. భారతీ మహిళపై తన ప్రతాపం చూపించారు. అవును.. వీడియో తీస్తుండగానే భౌతిక దాడికి దిగింది. తనకు భారతీయులు అంటే అసహ్యం అని కామెంట్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ట్రోల్ అవుతుంది. అగ్రరాజ్యంలో.. మెక్సికన్ అమెరికన్ మహిళ కూడా ఇలా ప్రవర్తిస్తారా అనే కామెంట్లు పెడుతున్నాయి. ఇదేం జాత్యాంహకారం అని భారతీయులు అంటున్నారు.

ఈ ఘటన టెక్సాస్‌లో జరిగింది. ఓ మెక్సికన్ యువతి నానా హంగామా చేసింది. భారతీయ మహిళతో దురుసుగా ప్రవర్తించింది. మీ దేశం మీరు వెళ్లిపోండి అని కామెంట్ చేసింది. ఇక్కడే ఎందుకు ఉంటున్నారని విరుచుకుపడింది. తాను ఇక్కడే పుట్టానని.. మెక్సికన్ అమెరికన్ అని పరుషంగా మాట్లాడింది. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

go back to india texas woman threatens assaults woman

ఈ నెల 24వ తేదీన ఘటన జరిగిందని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. సిక్ట్సీ వైన్ బయట ఘటన జరిగిందని పేర్కొంది. డిన్నర్ కోసం వస్తోండగా.. మెక్సికన్ మహిళ కనిపించింది. అప్పటికే ఆమె డ్రింక్ చేసింది. పరుషంగా మాట్లాడి గొడవకు దిగింది. లాగి కొట్టడమే కాకుండా.. మొబైల్ కూడా తీసుకుంది. ఘటన అంతా వీడియో రికార్డు అయ్యింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు.. మెక్సికన్ అమెరికన్ మహిళను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+