గ్రీన్‌లాండ్ 'ఘోస్ట్ డాగ్స్': ట్రంప్‌ను వణికిస్తున్న కుక్కల సైన్యం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై పదేపదే కన్నేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అయితే గ్రీన్‌లాండ్‌ రక్షణ వ్యవస్థ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అక్కడ మోహరించిన "సిరియస్ డాగ్ స్లెడ్ పెట్రోల్" (Sirius Dog Sledge Patrol) గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి సాధారణ కుక్కలు కావు, హిట్లర్ సైన్యాన్నే గడగడలాడించిన గ్రీన్‌లాండ్ వీర యోధులు.

డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ వెనుక ఉన్న భయం
ఇటీవల ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ.. "గ్రీన్‌లాండ్ భద్రత కోసం డెన్మార్క్ ఏం చేసిందో తెలుసా? వారు మరో డాగ్ స్లెడ్ (కుక్కల బండి)ని అదనంగా చేర్చారు" అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. పైకి ఇది ఎగతాళిగా అనిపించినా, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా నిగూఢంగా ఈ కుక్కల సైన్యం పట్ల భయాందోళన వ్యక్తం చేస్తోంది. గ్రీన్‌లాండ్‌లో ఉండే అత్యంత కఠినమైన వాతావరణంలో ఈ కుక్కలతో పోరాడటం అమెరికా సైనికులకు కూడా అసాధ్యమైన పని.

Greenland Ghost Dogs The Canine Army That Has Donald Trump Worried

ఈ కుక్కల సైన్యం ఎందుకింత ప్రమాదకరం?
గ్రీన్‌లాండ్‌లోని మంచుకొండలు, మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో ఏ ఆధునిక ఆయుధాలూ సరిగ్గా పనిచేయవు. కానీ ఈ కుక్కలు ఆ వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల అక్కడ యుద్ధం చేయడంలో ఇవి దిట్ట. ఇవి కేవలం మనుషులనే కాదు,మంచు ఎలుగుబంట్లతో కూడా ఎదుర్కోగలవు. వీటి ఘ్రాణ శక్తి అద్భుతం. శత్రువుల జాడను కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి సైనికులను అప్రమత్తం చేస్తాయి. సూర్యుడు అస్సలు ఉదయించని శీతాకాలంలో కూడా ఇవి వరుసగా ఐదు నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం పెట్రోలింగ్ చేయగలవు.

హిట్లర్ సైన్యాన్నే తరిమికొట్టిన చరిత్ర
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ సైన్యం గ్రీన్‌లాండ్ తీరం ద్వారా చొరబడాలని చూసినప్పుడు.. రాయల్ డేనిష్ నేవీ ఈ కుక్కల దళాన్ని రంగంలోకి దింపింది. ఆ మంచు ఎడారిలో నాజీ సైనికులను ఈ కుక్కలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 1950లో ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సమయంలో రష్యా ముప్పు నుంచి తట్టుకోవడానికి వీటిని మళ్లీ క్రియాశీలం చేశారు. వీటిని ఇప్పుడు "సిరియస్ పెట్రోల్" అని పిలుస్తారు.

నిపుణుల హెచ్చరిక
డెన్మార్క్ మాజీ రియర్ అడ్మిరల్ టోర్బెన్ ఆర్టింగ్ జోర్గెన్సన్ మాట్లాడుతూ.. "గ్రీన్లాండ్‌ను దక్కించుకోవడం చాలా సులభమని ట్రంప్ భావిస్తున్నారు. కానీ అక్కడ పని చేయడం గురించి కనీస అవగాహన లేకపోతే సర్వనాశనం అవ్వడం ఖాయం" అని హెచ్చరించారు. హైటెక్ డ్రోన్లు, శాటిలైట్లు చేయలేని పనులను ఈ కుక్కల సైన్యం అలవోకగా చేయగలదు. గ్రీన్లాండ్ కేవలం మంచు గడ్డ మాత్రమే కాదు, ఖనిజ సంపదకు నిలయం. అందుకే అమెరికా, చైనా వంటి దేశాలు దీనిపై కన్నేశాయి. అయితే, అక్కడ పహారా కాస్తున్న ఈ "ఘోస్ట్ డాగ్స్"ను ఎదుర్కోవడం ఏ అగ్రరాజ్యానికైనా తలకు మించిన భారమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+