అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు..! ట్రంప్ చర్యల వేళ..!
వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను వారి దేశంలోనే దాడి చేసి బంధించి తీసుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో ఆయన డిప్యూటీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఓహియోలోని జేడీ వాన్స్ నివాసం వద్ద కాల్పులకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఓహియోలోని జేడీ వాన్స్ నివాసం వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. అయినా ఆగంతకులు కాల్పులకు దిగడం చర్చనీయాంశమైంది.అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిగిన సమయంలో వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించిన సిన్సినాటీ పోలీసులు.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ట్రంప్ నివాసం వద్ద కాల్పుల ఘటన తర్వాత ఆయన పలు దేశాలపై చర్యలకు దిగారు. ఆంక్షల విధింపు సహా దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసం వద్దా అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో ట్రంప్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు ఈ కాల్పుల ఘటనకు కారణం లేదా నిందితుడి గురించి వివరాలు వెల్లడించలేదు. అయితే వెనెజులా అధ్యక్షుడి దంపతుల్ని ట్రంప్ అదుపులోకి తీసుకుని అమెరికా కోర్టులో విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి పరిస్ధితులకు అద్దం పట్టేలా ఉంది.












Click it and Unblock the Notifications