గన్ కల్చర్: సియాటిల్లో కాల్పులు, ఒకరి మృతి

వాషింగ్టన్: అమెరికాలోని సియాటిల్ విశ్వవిద్యాలయంలోకి ఓ దుండగుడు చొరపడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని విద్యార్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గురువారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

వాషింగ్టన్‌లోని సియాటిల్ పసిపిక్ విశ్వవిద్యాలయంలో ఒక దుండగుడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. 4,272 మంది విద్యార్థులు ఉండే ఈ ప్రైవేట్ వర్శిటీలోకి ప్రవేశించిన దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు.

Gunman kills one, injures three on Seattle campus

తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తుపాకీలో గుళ్లు పూర్తయిన తర్వాత దానిని రీ లోడ్ చేస్తుండగా విద్యార్థులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దుండగుడు కాల్పులు జరుపుత్నన్నప్పుడు వర్శిటీలో పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్షలు వాయిదా వేశారు. ఈ సందర్భంగా అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దుండగుడు క్యాంపస్‌లోని సైన్స్ బిల్డింగ్ నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+