'భారత్ కు వెళ్లొద్దు.. H-1B వీసాదారులకు కీలక సూచనలు'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత భద్రత పేరుతో విదేశీయులను అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. H-1B వీసాల జారీలోనూ కఠినమైన నిబంధనలను తీసుకొచ్చారు ట్రంప్. వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ ను విస్తరించడమే కాకుంగా.. నైపుణ్యాలతో అమెరికాకు H-1B వీసాలపై వచ్చే వారిపై వెట్టింగ్ ను మరింత పెంచిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు H-1B వీసాదారులకు కీలక సూచనలు చేశారు. భారత్ కు వెళ్లొద్దని సూచించారు. భారత్ లో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకూ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో భారత్ కు వెళ్లి అక్కడ చిక్కుకుపోవద్దని.. ఉద్యోగాలు వదులుకోవద్దని.. ఫ్యామిలీకి దూరం కావొద్దని సూచనలు చేశారు. భారత్ కు వెళ్తే వీసా స్టాంపింగ్ లో ఆలస్యం జరిగి చిక్కుల్లో పడాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భారత్ లో వీసా ఇంటర్వ్యూలు నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో అమెరికాలోని అటార్నీలు అక్కడి H-1B వీసాదారులకు కీలక సూచనలు చేశారు. భారత్ కు వెళ్లొద్దని సూచించారు. భారత్ కు వెళ్తే ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని.. అమెరికాలోని అనేక కంపెనీలు.. చాలాకాలం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చే ఆలోచనలో లేవని స్పష్టం చేశారు. అమెరికా నుంచి వందలాది మంది H-1B వీసాదారులు ఇంటర్వ్యూల కోసం భారత్ కు వచ్చినట్లు తేలిన నేపథ్యంలో అమెరికాలోని అటార్నీలు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అసలైతే భారత్ లో వీసా ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా.. వాటిని వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ కు అమెరికా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు H-1B వీసాదారులకు చివరి నిమిషంలో మెసేజ్ లు వచ్చాయి. దీంతో అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు H-1B వీసాదారులకు కీలక సూచనలు చేశారు. భారత్ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోవద్దని సూచనలు చేశారు. అమెరికాలోని కంపెనీలు ఎక్కువ కాలం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కంటిన్యూ చేయవని అన్నారు. ఈ మేరకు ఉద్యోగాలు వదులుకోవద్దని.. ఫ్యామిలీకి దూరం కావొద్దని సూచనలు చేశారు. భారత్ కు వెళ్తే వీసా స్టాంపింగ్ లో ఆలస్యం జరిగి చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA), దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విదేశీయులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది కాలంగా వలస నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85 వేల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications