H-1B Visa: ట్రంప్ కు స్వదేశీ షాకులు-మరో ఇద్దరు భారతీయులకు బంపర్ ఆఫర్..!
అమెరికాలో ట్రంప్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయుల్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఇది ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. తాజాగా హెచ్1బీ వీసాల ఛార్జీలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా భారతీయుల్ని ఉద్దేశించి చేసిందేనని గణాంకాలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత మధ్య కొత్తగా హెచ్1బీ వీసాలు తీసుకునే వారికే ఈ ఛార్జీలు వర్తింపచేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు.
అయితే హెచ్1బీ వీసాల జారీ విషయంలో ట్రంప్ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ అమెరికాలో టెక్ కంపెనీలు మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని ఏమాత్రం లెక్కచేయకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నాయి. దీంతో తాజాగా రెండు టాప్ అమెరికన్ కంపెనీలు తమ సీఈవోలుగా భారతీయుల్ని నియమించుకున్నాయి. దీంతో ట్రంప్ ఆదేశాల ప్రభావం టెక్ కంపెనీలపై ఏమాత్రం లేదని అర్దమవుతోంది.

భారతీయుల్ని సీఈవోలుగా నియమించుకున్న కంపెనీల్లో టీ మొబైల్ తో పాటు మోల్సన్ కూర్స్ కూడా ఉంది. ఇందులో టీ మొబైల్ సీఈవోగా శ్రీనివాస్ గోపాలన్ ను నియమించగా.. మోల్సన్ కూర్స్ సీఈవోగా రాహుల్ గోయల్ ను నియమించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలుగా భారతీయులు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ఉన్నారు. వీరితో పాటు వందల సంఖ్యలో అమెరికన్ కంపెనీలు భారతీయ నిపుణులకు అత్యున్నత ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అమెరికన్లు వెనుకబడిపోతున్నారనేది ట్రంప్ ఆవేదన. అయితే దీన్ని పట్టించుకునే స్ధితిలో ఆయా కంపెనీలు లేవని తెలుస్తోంది.

అమెరికా టెలికాం దిగ్గజం టి-మొబైల్ సీఈవోగా నియమించిన శ్రీనివాస్ గోపాలన్ నవంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన గోపాలన్ ప్రస్తుతం టి-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.. 2020 నుండి కంపెనీకి నాయకత్వం వహించి కొత్తగా సృష్టించబడిన వైస్ చైర్మన్ పదవికి మారిన మైక్ సీవర్ట్ స్థానంలో ఆయన్ను నియమించారు. మరోవైపు చికాగోకు చెందిన బేవరేజెస్ దిగ్గజం మోల్సన్ కూర్స్ అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా రాహుల్ గోయల్ ను కొత్త ప్రెసిటెండ్, సీఈవోగా నియమించింది. గోయల్ 24 సంవత్సరాలుగా కంపెనీలో ఉన్నారు. మైసూర్‌లో ఇంజనీరింగ్ చదివిన ఆయన.. అమెరికా, బ్రిటన్ , భారత్ లోనూ కూర్స్ , మోల్సన్ బ్రాండ్‌లలో పనిచేశారు.












Click it and Unblock the Notifications