హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్: 7 లక్షల ఇండియన్స్‌పై ప్రభావం, ట్రంప్ షాక్‌తో స్వదేశానికేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా విధానంలో తీసుకొచ్చిన కఠినతర నిర్ణయం కారణంగా విదేశీయులకు తీవ్రంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.ఈ నిబంధనల కారణంగా ఇండియాకు చెందిన సుమారు 7 లక్షల మంది స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

టెక్కీలకు షాక్: అమెరికా నుండి స్వదేశానికి వందలాది మంది ఇండియన్లు

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో ఉంటున్న స్థానికులకే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలతో విదేశీయులకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

టెక్కీలకు శుభవార్త: ఈ ఏడాది ఐటీలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు

హెచ్ 1 బీ వీసా విధానంలో కొత్త సవరణ విదేశీయులు స్వదేశాలకు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన టెక్కీలపై తీవ్రమైన ప్రభావం కన్పిస్తోంది.

ట్రంప్ ప్రతిపాదనలతో విదేశీయులకు ఇబ్బందులు

ట్రంప్ ప్రతిపాదనలతో విదేశీయులకు ఇబ్బందులు

అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి ఉపకరించే హెచ్‌-1బీ వీసా విధానంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తీసుకొస్తున్న ఓ ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది.హైర్ అమెరికా, బై అమెరికన్ అనే కొత్త నిర్ణయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమల్లోకి తెచ్చింది. దీంతో హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం హెచ్‌-1బీ వీసాల విధానంలో ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది.

వీసా గడువు పూర్తై స్వదేశానికే

వీసా గడువు పూర్తై స్వదేశానికే

హెచ్‌-1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ...గ్రీన్‌కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది.దీంతో వీసా గడువు పూర్తైతే స్వదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

7 లక్షలమంది ఇండియన్లపై ప్రభావం

7 లక్షలమంది ఇండియన్లపై ప్రభావం

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొన్న నిర్ణయం అమెరికాలో నివాసం ఉంటున్న సుమారు 7 లక్షల మంది ఇండియన్లపై ప్రభావం ఉంటుంది. వారంతా గ్రీన్‌కార్డుకు దర ఖాస్తు చేసుకున్నా, వీసా గడువు ముగిసేలోపు అది మంజూరవ్వకపోతే మన దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాల జారీ, కొనసాగింపు నిబంధనలను ట్రంప్‌ యంత్రాంగం ఒక్కొక్కటిగా కఠినం చేస్తుండటం తెలిసిందే.

ఉద్యోగాల కోసం

ఉద్యోగాల కోసం

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వారందరి ఉద్యోగాలూ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది ట్రంప్‌ ఆలోచనగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Trump administration is considering a proposal that could potentially lead to large-scale deportation of foreigners on H-1B visas for high-speciality workers waiting for their Green Card — mostly Indians — and drastically alter the way high-tech companies operate in the United States.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి