Happy New Year 2021: కొత్త సంవత్సరంలోకి ఎంటరైన న్యూజిలాండ్ - పటాకులతో గ్రాండ్ వెల్కమ్
కరోనా విలయనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి ఎంటైరపోయింది ద్వీపదేశం న్యూజిలాండ్. పసిపిక్ మహా సముద్రంలోని సుమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2021కు స్వాగతం పలుకగా, కొద్ది నిమిషాల గ్యాప్ తో న్యూజిలాండ్ సైతం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
దేశ రాజధాని వెల్లింగ్టన్ లో గల ప్రఖ్యాత కూడళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో భారీ ఎత్తున పటాకులు పేల్చారు. మిరుమిట్లు గొలిపే బాణా సంచా మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ జనం గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. టోంగా, కిరిబాటి దీవుల్లోనూ వేడుకలు అంబరాన్నంటాయి. కరోనా ఆంక్షల మధ్యే ప్రజలు కొత్త ఏడాది సంబురాలు జరుపుకొన్నారు.

న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలోనూ నూతన సంవత్సరం ప్రారంభంకానుంది. మరో మూడు గంటల్లో జపాన్ సైతం 2021లోకి అడుగుపెట్టనుంది. ఇండియా కంటే 30 నిమిషాలు ముందుగానే పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ కొత్త ఏడాదిలోకి ప్రవేశించనున్నాయి.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలోని పలు రాష్ట్రాలు వేడుకలను నిషేధించాయి. అయితే, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు మాత్రం యధావిధిగా తెరిచే ఉంటాయి. కొత్తరకం కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో ఇండియాలో 60 శాతం మంది ప్రజలు ఇళ్లలోనే న్యూ ఇయర్ వేడుకులు జరుపుకొనేందుకు ప్లాన్ చేసినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.













Click it and Unblock the Notifications