Happy New Year! న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో 2022 ఎంట్రీ, అంబరాన్నంటిన సంబరాలు

ఆక్లాండ్: కొత్త సంవత్సరంమరికొద్ది గంటల్లో రానుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పటికే న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో కొత్త సంవత్సరం ఎంట్రీ ఇచ్చింది. పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా ద్వీపంలోనే అందరికంటే ముందుగా 2022లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. కొద్ది గంటల క్రితమే టోంగా, కిరిబాటి దీవులు కూడా కొత్త ఏడాదిని స్వాగతించాయి.

సమోవాలో మొదటగా న్యూఇయర్ వేడుకలు

సమోవాలో మొదటగా న్యూఇయర్ వేడుకలు

కాగా, సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటల తర్వాత మనదేశంలోకి 2022 సంవత్సరం అడుగుపెడుతుంది. అదే సమయానికి భారత్ తోపాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. భారత్ తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు 43 దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలు, కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రియా దేశాలున్నాయి.

న్యూజిలాండ్‌లో న్యూఇయర్ ఎంట్రీ.. సంబరాలు

మరోవైపు, న్యూజిలాండ్ వాసులు కూడా 2022లోకి అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఆనందోత్సాహాల మధ్య న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆక్లాండ్ స్కైటైవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా వెలుగులతో స్కైటవర్ వద్ద కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి.

2022 న్యూఇయర్ వేడుకలు.. కరోనా ఆంక్షల నడుమే..

2022 న్యూఇయర్ వేడుకలు.. కరోనా ఆంక్షల నడుమే..

కాగా, ఆస్ట్రేలియాలో మనకంటే ఐదున్నర గంటల ముందు నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి. మరోవైపు, సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్ దేశంలో కూడా మూడున్నర గంటల ముందే 2022లోకి అడుగుపెడుతుంది. అదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనున్నాయి. ప్రపంచ దేశాలన్ని కొత్త సంవత్సరం వేడులను ఘనంగా జరుపుకునేందుకుంటున్నాయి. అయితే, కరోనావైరస్, ఒమిక్రాన్ వేరియంట్లు మాత్రం ప్రజలను స్వేచ్ఛగా వేడుకలను జరుపుకోనివ్వడం లేదు. మనదేశంతోపాటు అనేక ప్రపంచ దేశాల ప్రజలు కరోనా ఆంక్షల మధ్యే వేడుకలను జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+