నెక్స్ట్.. కమల హ్యారిస్: మస్క్ కీలక ప్రకటన

Elon Musk Interview with Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. మొన్నటికి మొన్న హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలను ముమ్మరం చేశారు. విస్తృతంగా పర్యటిస్తోన్నారు.

ఎన్నికల వేడి..

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎదుర్కొంటోన్నారు.

Happy to host Kamala on an X Spaces too says Elon Musk

ఎక్స్‌తో ఇంటర్వ్యూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అపర కుబేరుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది- మస్క్ అధికారిక హ్యాండిల్‌లో ప్రత్యక్ష ప్రసారమౌతోంది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

అనేక అంశాలపై..

పెన్సిల్వేనియా బట్లర్ ప్రాంతంలో జరిగిన ప్రాణాంతక దాడి, 2019 ఎన్నికల్లో ఓటమి, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య తలెత్తిన సంక్షోభ పరిస్థితులు, భారత్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన, అఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం, సిరియా.. వంటి అంశాలపై ట్రంప్ స్పందించారు.

కమలతోనూ

ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కమమలా హ్యారిస్‌తోనూ ఇంటర్వ్యూ నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు ఎలాన్ మస్క్. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. కమలా హ్యారిస్‌తో ఎక్స్ స్పేస్‌ నిర్వహించబోతోండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

బైడెన్ అవుట్..

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ చేయనున్నారు కమలా హ్యారిస్. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థిత్వాన్ని గతంలో ప్రకటించినప్పటికీ.. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు. వయసు మీద పడటం, కరోనా వైరస్ బారిన పడటం, బహిరంగ సభల్లో తీవ్రంగా తడబడుతోండటం వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

టిమ్ వాల్జ్‌తో..

కమలా హ్యారిస్ సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్‌ను సెలెక్ట్ చేసుకున్నారామె. ప్రస్తుతం మిన్నెసొటా గవర్నర్‌గా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు యూఎస్ ఆర్మీలో నాన్ కమిషన్డ్ ఆఫీసర్‌గా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+