40 ఏళ్ళు వచ్చినా ఇంకా శోభనం కోసం ఎదురుచూపులే
లండన్ :పెళ్ళికి ముందే సెక్స్ ను ఎంజాయి చేస్తున్నారు ఈ తరం యువత. అయితే లండన్ కు చెదిన ఓ వ్యక్తి ది మాత్రం వింత పరిస్థితి. 40 ఏళ్ళు దాటినా శోభనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన శోభనం కోసం వైద్యులు కూడ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు.ప్రముఖ సెక్స్ వర్కర్ తో తొలిసారి ఆయన తన శోభనాన్ని జరుపుకోనున్నారు.
లండన్ కు చెందిన 43 ఏళ్ళ ఓ వ్యక్తి తొలిరాత్రి అనుభవం కోసం ఎదురుచూస్తున్నాడు.ఇ:తవరకు కూడ ఆయన సంసారసుఖానికి దూరంగానే ఉన్నాడు.ఆరేళ్ళ వయస్సులో హడ్డర్స్ పీల్డ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. ఓ కారు ఆయనను డీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళింది.ఈ ప్రమాదమే ఆయన కొంపముంచింది. ఈ ప్రమాదం నుండి ఆయన బతికి బయటపడ్డాడు. కాని, సంసారసుఖం మాత్రం ఇంకా దక్కలేదు.కారణమేమిటంటే ఈ ప్రమాదంలో ఆయన పురుషాంగం పూర్తిగా దెబ్బతింది.
యుక్తవయస్సు రాగానే ఆయన డాక్టర్లను సంప్రదించాడు.పలుమార్లు ఆయనకు డాక్టర్లు ఆపరేషన్లు నిర్వహించారు. ఇటీవలనే చివరి శస్త్రచికిత్సను చేసి 8 అంగుళాల పొడవైన కృత్రిమ పురుషాంగాన్ని అమర్చారు.అంతేకాదు అతడి వృషణాలలో ఒక బటన్ ను అమర్చారు. ఈ బటన్ సహాయంతో పురుషాంగం పనిచేసేలా డాక్టర్లు ఏర్పాటు చేశారు.

ఈ కృత్రిమ పురుషాంగం సహాయంతో ప్రముఖ సెక్స్ వర్కర్ రోజ్ తో ఆయన తొలి రాత్రి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాడు.2013 లో ఆమె సెక్స్ వర్కర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడ దక్కించుకొన్నారు.2014 లో బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీచేసింది.ఆమెతో కలిసిన సమయంలో ఆ వ్యక్తి పురుషాంగం ఎలా పనిచేస్తోందో చూడాలనే ఆసక్తి కూడ వైద్యుల్లో ఉంది.
ఇంకేముంది తొలి రాత్రి కోసం ఆ వ్యక్తి సిద్దంగా ఉన్నాడు. కాని, మరో అపశకునం ఆయనను వెంటాడింది.ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.కోలుకోవడానికి కనీసం నెలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.ఆ తర్వాతే రోజ్ తో ఆయన తొలి అనుభవం కోసం వైద్యులు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications