ఇజ్రాయెల్ సైన్యంపై విరుచుకుపడిన హెజ్బొల్లా: భారీ నష్టం

హెజ్‌బొల్లాను అంతం చేసేందుకు వరుస దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో జరిగిన భీకర పోరుో 30 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. హెజ్‌బొల్లా దళాలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ సైన్యానికి భారీ నష్టం జరిగింది. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి.

ఇజ్రాయెల్ దళాలను లక్యంగా చేసుకుని రాకెట్ల దాడులకు పాల్పడింది హెజ్‌బొల్లా. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 3.15 గంటలకు హెజ్బుల్లా దళాలు దాడులు తీవ్రతరం చేశాయి. రామియాసైట్ సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ సైనికులై గైడెడ్ క్షిపణి దాడులకు పాల్పడింది హెజ్బుల్లా. దీంతో పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Hezbollah fierce attacks on Israeli army 30 soldiers killed

30 మందికిపైగా ఇజ్రాయెల్ సైనికులు మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక వాహనాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా భారీ క్షిపణులతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైనికులను ప్రతిఘటించేందుకు వరుస దాడులకు పాల్పడుతోంది హెజ్బుల్లా. తాజా దాడులతో ఇజ్రాయెల్ సైన్యానికి భారీ ఎదురుబెబ్బ తగిలినట్లే చెప్పవచ్చు.

హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ అంతటా అలాగే తూర్పు, బీరూట్ దక్షిణ శివార్లలో కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. ఇజ్రాయెల్ దాడులతో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు.

ఇది ఇలా ఉండగా, పశ్చిమాసియాలో యుద్ధానికి కారణమైన హమాస్​ మిలిటెంట్ సంస్థ, గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి కంటే ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌ నగరం టెల్‌అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషె అవివ్‌, అజ్రీలీ మాల్‌ కాంప్లెక్స్‌పై దాడులు చేసి నేలమట్టం చేయాలని హమాస్‌ కుట్రలు పన్నినట్లు పేర్కొంది.

హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలు వరుసగా జరిపిన సమావేశాల్లో ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌ అధికారులతో హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ సంభాషణలను కూడా గుర్తించారు. మరోవైపు, హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, జరిపిన దాడులు గాజాలో 19 మంది ప్రాణాలుకోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+