రెచ్చిపోయిన హెజ్బొల్లా- ఇజ్రాయెల్‌కు భారీగా ప్రాణనష్టం
Hezbollah attacks on Israel: వరుస దాడులతో కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా.. ప్రతీకారానికి దిగింది. భారీ దాడులకు పాల్పడింది. రాకెట్లను సంధించింది. ఈ ఘటనలో ఏడుమంది ఇజ్రాయెల్ పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
కిందటి నెల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషెమ్ షఫియొద్దీన్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరుట్‌లో గల హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై సాగించిన డ్రోన్ దాడుల్లో ఆయన హతం అయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 4వ తేదీన బీరుట్ దక్షిణ ప్రాంతంపై నిర్వహించిన దాడుల్లో షఫియొద్దీన్ మరణించినట్లు వెల్లడించింది. అప్పటి దాడుల్లో షఫియొద్దీన్‌తో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ కమాండర్ హుస్సేన్ అలీ హజీమా కూడా మృతిచెందినట్లు నిర్ధారించింది. ఇది హెజ్బొల్లా మిలిటెంట్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్టయిందని వ్యాఖ్యానించింది.
ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగింది హెజ్బొల్లా. ఆ దేశ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. జనావాసాలను సైతం లెక్క చేయలేదు. మెటులా, హైఫా ప్రాంతాలపై భారీగా రాకెట్లను సంధించింది. ఈ ఘటనల్లో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు కాగా మిగిలిన ముగ్గురు విదేశీయులు.
లెబనాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది మెటులా. ఆపిల్‌ను పెద్ద ఎత్తున పండిస్తారిక్కడ. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలపై హెజ్బొల్లా పెద్ద ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. ఈ ఘటనలో పొలాల్లో పని చేస్తోన్న అయిదుమంది మరణించారు. పంటపొలాలు భారీగా ధ్వంసం అయ్యాయి.
దీని తరువాత హైఫాపై దాడులను చేపట్టింది. ఇక్కడి ప్రధాన నగరం కిర్యాట్ అటపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. 61 వేల మందికి పైగా జనాభా గల కిర్యాట్ అట సిటీలో భారీగా ఆస్తినష్టం సంభవించింది.
ఈ దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఘాటుగా స్పందించింది. అమాయక ప్రజలను హెజ్బొల్లా మిలిటెంట్లు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించింది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించింది. హెజ్బొల్లాకు చెందిన రడ్వాన్ ఫోర్సెస్, సిరియాలోని అల్-ఖుసైర్‌కు చెందిన మ్యునీషియన్స్ యూనిట్ ఈ దాడులు చేసిందని నిర్దారించింది.
-
బాంబుల వర్షం... 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం












Click it and Unblock the Notifications