ట్రంప్ పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు : 'నా వెనుక కూడా పడ్డాడు'
న్యూయార్క్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ట్రంప్ పై లైంగిక వ్యాఖ్యల ఆరోపణల పర్వం కొనసాగుతుండగా ఇప్పుడు తాను బాధితురాలేనని అంటూ గొంతు కలిపింది డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. ఆదివారం నాడు ఓ టీవి చానెల్ డిబేట్ లో పాల్గొన్న హిల్లరీ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ప్రేమోన్మాదిగా మారిపోయిన ట్రంప్ తన వెంట కూడా పడ్డారని, మీదిమీదికొచ్చి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారని' చెప్పారు. అయితే హిల్లరీ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. హిల్లరీ ఆరోపణల్లో నిజం లేదని, కేవలం తనను ప్రతిష్ఠను మసకబార్చేందుకే హిల్లరీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ట్రంప్.












Click it and Unblock the Notifications