బంగ్లాదేశ్ లో హిందువును కొట్టిచంపారు- మృతదేహాన్ని చెట్టుకు కట్టి కాల్చేశారు..!!

బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. దాడులు- ప్రతిదాడులు సాగుతున్నాయి. చివరికి మీడియా హౌస్ లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో', 'డైలీ స్టార్' కార్యాలయాలపై దాడులు సాగించారు. నిప్పు పెట్టారు. విధ్వంసాన్ని సృష్టించారు.

బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం 15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.

Hindu Man Dipu Chandra Das Dies in Bangladesh Amid Protests

భారత్ తో పాటు ఉద్వాసనకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి.. షరీఫ్ ఒస్మాన్ హాదీ. అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. ఇంక్విలాబ్ మంచ్ తరఫున పలు ఆందోళనలకు నాయత్వం వహించాడు. అతని మారణవార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుక్షణం నుంచే అల్లర్లు మొదలయ్యాయి.

అదే సమయంలో ఆందోళనకారులు హిందువులపై దాడులకు తెగబడ్డారు. మైమెన్‌సింగ్‌ డివిజన్ లోని భలూకాలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని కొట్టిచంపారు. దీపు చంద్ర దాస్‌ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అతని పూర్వీకులు చాలాకాలం కిందటే బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. భలూకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవాడు. గురువారం రాత్రి దుబాలియా పారా ప్రాంతంలో అల్లరి మూకలు అతనిపై దాడికి దిగాయి. దారుణంగా హత్య చేశాయి. మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపిణలపై ఈ దాడి జరిగింది.

ఘటన అనంతరం దుండగులు దీపు మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీపు చంద్ర దాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం మైమెన్‌సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+