Hindu Temple: కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్
Hindu Temple: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేవాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్నిఫోర్నియాలోని చినో హిల్స్ లో ఉన్న బాప్స్ స్వామి నారాయణ మందిరం గోడలపై దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. పెయింట్ తో ఆలయగోడలపై విద్వేషపూరిత రాతలు రాశారు. ఈ విషయాన్ని బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ(BAPS) ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన భారత సర్కారు తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, హిందూ దేవాలయాలను కాపాడాలని కోరింది.
స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఈ సంఘటనపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. "కాలిఫోర్నియాలోని చినో హిల్స్ లోని ఒక హిందూ దేవాలయం విధ్యంసం గురించి వార్తలను చూశాం. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని , ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులను కోరుతున్నాం." అని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. గతేడాది సెప్టెంబర్ లో ఇలాంటి సంఘటనలే జరిగాయి. సెప్టెంబర్ 25 రాత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో బాప్స్(BAPS) స్వామి నారాయణ ఆలయం ధ్వంసం చేయబడింది. న్యూయార్క్ లోని BAPS ఆలయంలో ఇలాంటి సంఘటన జరిగిన 10 రోజులలోపే ఇది జరిగింది. హిందూ వ్యతిరేక సందేశాలను ఆలయ గోడలపై రాశారు. వీటిలో 'హిందువులు వెనక్కి వెళ్లండి' వంటి నినాదాలు ఉన్నాయి. ఇది స్థానిక హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు స్పందించాలని భారత అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
Breaking | The largest Hindu temple in California, @BAPS_PubAffairs temple in Chino Hills, was vandalized with profanities earlier today.
— Hindu American Foundation (@HinduAmerican) March 8, 2025
We ask @ChinoHills_PD, @FBI @FBIDirectorKash @DNIGabbard to investigate this latest in a string of anti-Hindu hate crimes on our sacred… pic.twitter.com/jT4Z0zCnIp
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications