Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంచలన నిర్ణయం: వారికి మాల్దీవుల్లో పొగ తాగడం నిషేధం!

Smoking Ban: మాల్దీవులు పొగాకు వినియోగంపై ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జనవరి 2007 తర్వాత జన్మించిన ఏ వ్యక్తైనా మాల్దీవుల భూభాగంలో పొగ తాగడానికి వీల్లేదు. ఈ 'జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్' నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ఈ రకమైన నిషేధాన్ని అమలు చేసిన ఏకైక దేశంగా మాల్దీవులు నిలిచింది.

కొత్త నిబంధనలు ఏమిటంటే?
నిషేధం వర్తింపు: నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. జనవరి 1, 2007 లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు మాల్దీవులలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ఉపయోగించడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధించబడింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చర్యను ప్రతిపాదించారు. "ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, పొగాకు రహిత తరాన్ని ప్రోత్సహించడం" ఈ నిషేధం ప్రధాన లక్ష్యమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Historic Move Maldives Bans Smoking for Anyone Born After 2007

ఈ నిషేధం అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకు వర్తిస్తుంది. విక్రేతలు పొగాకు ఉత్పత్తులను విక్రయించే ముందు కొనుగోలుదారుల వయస్సును తప్పనిసరిగా ధృవీకరించాలి. విలాసవంతమైన పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన మాల్దీవులకు వచ్చే పర్యాటకులకూ ఈ నిషేధం వర్తిస్తుంది. పొగాకు ఉత్పత్తులపై జనరేషనల్ నిషేధంతో పాటు, మాల్దీవులు దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేపింగ్ (Vaping) ఉత్పత్తులపై కూడా కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా, ఏ వ్యక్తి అయినా ఈ-సిగరెట్లు, వేపింగ్ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం, పంపిణీ, స్వాధీనం, వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉంది.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనున్నారు. మైనర్ కు పొగాకు ఉత్పత్తులు అమ్మినవారికి రూ.50 వేలు జరిమానా విధించనున్నారు. వేప్ పరికరాలను ఉపయోగించిన వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నారు.

ప్రపంచంలో ఇతర దేశాల ప్రయత్నాలు
మాల్దీవులు ఈ నిషేధాన్ని అమలు చేసిన ఏకైక దేశంగా నిలిచింది. న్యూజిలాండ్ ఈ తరహా నిషేధాన్ని మొట్టమొదటగా ప్రకటించినప్పటికీ.. 2023 నవంబర్‌లో అది రద్దు చేయబడింది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిషేధాన్ని ప్రతిపాదించారు.. కానీ అది ఇంకా శాసన ప్రక్రియలో ఉంది. మాల్దీవుల ఈ నిర్ణయం ప్రపంచ ఆరోగ్య రంగంలో సంచలనంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+