Holi 2025: భారత్ కాకుండా.. ఏయే దేశాల్లో హోలీ జరుపుకుంటారో తెలుసా?
Holi 2025: హోలీ పండుగను భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? ఇందులో పాకిస్తాన్ తో సహా అనేక దేశాలు ఉన్నాయి. భారత పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి జనాభాలో 80 శాతం మంది హిందూ మతానికి చెందిన వారే కావడంతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. నేపాల్‌లో హోలీని ఫాల్గుణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. దీనిని నేపాలీ భాషలో ఫాగు పుంహి అని పిలుస్తారు. నేపాల్ లో హోలీ సందర్భంగా నీటితో నిండిన బెలూన్లను విసురుకుంటారు. దీనిని లోలా అని పిలుస్తారు. ఈ సంప్రదాయం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది.
పాకిస్థాన్ లో హోలీ ఇలా..
1947 స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్ కూడా భారతదేశంలో భాగమని తెలిసిందే. అందుకే ఇక్కడ కూడా హోలీ పండుగ జరుపుకుంటారుయ పాకిస్థాన్ లో హోలీ సందర్భంగా ఒక కుండను ఎత్తైన ప్రదేశంలో వేలాడదీసి.. తర్వాత దానిని పగలగొడతారు. ఈ కుండను చేరుకోవడానికి ప్రజలు ఒకరిపై ఒకరు ఎక్కి పిరమిడ్ ను ఏర్పరచుకుంటారు. దాని కింద నిలబడి ఉన్న వ్యక్తులు పిరమిడ్ లా ఏర్పడిన వ్యక్తులపై రంగులు, నీరు చల్లుతారు.

ఫిజీలో హోలీ జరుపుకుంటారిలా..
ఫిజీ అనేది ప్రపంచంలో ఎక్కువగా భారత సంతతికి చెందిన ప్రజలు నివసించే ఒక దేశం. ఇక్కడ కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో జానపద పాటలు, జానపద నృత్యాలు కూడా జరుగుతాయి. ఫిజీలో హోలీ సందర్భంగా పాడే జానపద పాటలను ఫాగ్ గానం అంటారు. ఫిజీలో హోలీ పండుగను శ్రీకృష్ణుడు, రాధా రాణితో ముడిపెట్టి జరుపుకుంటారు. వాటికి సంబంధించిన పాటలు పాడతారు.
మారిషస్ లో శివరాత్రి తర్వాత హోలీ ప్రారంభం
మారిషస్‌లో కూడా హోలీ జరుపుకుంటారు. ఇక్కడ శివరాత్రి తర్వాత వెంటనే హోలీ ప్రారంభమవుతుంది. ఇది ఫౌల్గుణ పౌర్ణమి వరకు జరుపుకుంటారు. మారిషస్ లో శీతాకాలం ముగిసి వసంతకాలం రాకకు సంబంధించి హోలీ పండుగను జరుపుకుంటారు. మారిషస్ లో కూడా హోలీకి ముందు ప్రజలు హోలికను కాల్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ఇక్కడ కూడా నీటి బెలూన్లను ఒకరిపై ఒకరు విసురుకుంటారు.
గయానాలో ఫాగ్వా..
భారత్, నేపాల్‌తో పాటు గయానాలో కూడా హోలీ జరుపుకుంటారు. ఇక్కడ హోలీని ఫాగ్వా అని పిలుస్తారు. హోలీ రోజున జాతీయ సెలవు దినం ప్రకటించడంతో ఈ పండుగ అక్కడ ఎంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందో అంచనా వేయవచ్చు. గయానాలో హోలీ వేడుక ప్రసాద్ నగర్ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రజలు రంగులు, నీటితో హోలీ ఆడడానికి గుమిగూడతారు.
ఫిలిప్పీన్స్ లోని మనీలాలో..
ఫిలిప్పీన్స్ లోని మనీలాలో హోలీని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ రంగుల పండుగ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు, గులాల్ చల్లుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ పార్టీ నిర్వహిస్తారు. ఫిలిప్పీన్స్ లో ఈ పండుగను చాలా మంది జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications