సౌదీ గ్రాండ్ మసీదులో రోబోలు-కృత్రిమ మేథతో ఇస్లాంపై అవగాహన..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (artificial intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది. ఇప్పటికే కార్పోరేట్ కంపెనీలన్నీ కృత్రిమ మేథను వాడుకుంటూ సిబ్బందిని తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో కృత్రిమ మేథ మతపరమైన అంశాల్లోనూ అండగా నిలుస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని వాడుకుని ఏకంగా రోబోల్ని రంగంలోకి దింపింది సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదు ( grand mosque). ప్రపంచంలోనే ప్రముఖ మసీదుల్లో ఒకటైన ఇందులో ఇప్పుడు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి.
సౌదీ గ్రాండ్ మసీదులో రోబోలు
సౌదీ అరేబియాలోని గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోలు భక్తుల్ని అబ్బుర పరుస్తున్నాయి. ప్రార్ధనల కోసం మసీదుకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై ఏకంగా 11 భాషల్లో భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి. మసీదులో చాలా చోట్ల రోబోలను ఏర్పాటు చేశారు. ఇవి రంజాన్ మాసంలో మసీదుకు వచ్చే భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఇస్లామిక్ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి.

రోబో ఎలా పనిచేస్తుందంటే ?
గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోల్లో పెద్ద స్క్రీన్ టచ్ ఎల్‌సిడి అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ఆధునిక ఇస్లాం గురించి 11 భాషలలో సమాచారం ఇస్తారు. దీని ద్వారా మసీదు మొత్తానికి ఏ సమాచారమైనా ఏకకాలంలో ఇవ్వవచ్చు. ఈ రోబోల ద్వారా మసీదుకు చేరుకున్న ఎవరైనా ఇస్లాంకు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగవచ్చు. ఈ రోబో ద్వారా మత పెద్దల్ని కూడా ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. మసీదులో అమర్చిన రోబోలు అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ, చైనీస్ మరియు బెంగాలీతో సహా 11 భాషలలో సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఈ భాషల్లో రోబోతో నేరుగా మాట్లాడవచ్చు. రోబోలో 21 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంది.

ఆధునిక ఇస్లాం వ్యాప్తికి ఉపయోగం
సౌదీలోని గ్రాండ్ మసీదులో ఏర్పాటు చేసిన రోబోలు కృత్రిమ మేథను వాడుకుని ఆధునిక ఇస్లాంను వ్యాప్తి చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మసీదులోని మతపరమైన వ్యవహారాల అధ్యక్షుడు అబ్దుల్‌రహ్మాన్ అల్ సుదైస్ చెప్తున్నారు.భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మసీదులో ఏఐ వాడుతున్నట్లు ఆయన తెలిపారు. రంజాన్ మాసంలో దీనిని ప్రారంభించాలని, తద్వారా ఉదారవాద ఇస్లాం సందేశాన్ని ప్రపంచానికి అనేక భాషల్లో అందించాలని తమ దేశాధ్యక్షుడు కోరినట్లు ఆయన వెల్లడించారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications