మోడీ లాగే చెదిరిన మెక్రాన్ కల! ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలతో ఇద్దరికీ పోలిక..!
ఫ్రాన్స్ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు షాక్ తప్పలేదు. 577 స్ధానాలున్న పార్లమెంట్ దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ "లా రిపబ్లిక్ ఎన్ మార్చే" అనూహ్యంగా వెనుకబడింది. అదే సమయంలో లెఫ్ట్ కూటమి అత్యధిక స్ధానాల్ని కైవసం చేసుకుంది. దీంతో అధికారం కావాలంటే లెఫ్టిస్టులతో కలిసి ముందుకెళ్లక తప్పని పరిస్దితి మాక్రాన్ కు ఎదురవుతోంది. ఇదే సమయంలో భారత్ లో ప్రధాని మోడీతో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను పోలుస్తూ పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఫ్రెంచ్ రాజకీయాలను పునర్ నిర్మించే లక్ష్యంతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన అతిపెద్ద ప్రయత్నం విఫలమైంది. భారీ మెజార్టీ సాధించి తన వ్యూహాల్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించిన మాక్రాన్ ను ఫ్రెంచ్ ప్రజలు ఆదరించలేదు. దీంతో ఆయన పార్టీ లా రిపబ్లిక్ ఎన్ మార్చే రెండో స్దానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అత్యధిక సీట్లు గెల్చుకున్న లెఫ్టిస్టు కూటమికి అధికారం అందని ద్రాక్షగా మారడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. ఇప్పుడు మాక్రాన్, లెఫ్టిస్టులతో కలిస్తేనే మరోసారి అధికారం దక్కనుంది.

మరోవైపు భారత్ లో జాతీయ వాదం, హిందూ అతివాదం, పటిష్ట నాయకత్వం పేరుతో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పలేదు. గతంలో ఎన్డీయే మిత్రపక్షాలున్నా వారితో సంబంధం లేకుండానే సొంతంగా కేంద్రంలో రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మోడీకి.. ఈసారి మాత్రం తప్పనిసరిగా మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇవాళ మాక్రాన్ కు తగిలిన ఎదురుదెబ్బతో మోడీ షాక్ ను పోలుస్తున్నారు. ఇద్దరూ అతి విశ్వాసంతో ఎన్నికలు ఎదుర్కొని దెబ్బతిన్నారు.












Click it and Unblock the Notifications