బైడెన్‌కు 15 ఏళ్ల జైలు.. మిలియన్ డాలర్ల ఫైన్?: అందుకే తప్పించారా?
US President Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో కూరుకుపోయారు. పీకల్దాక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ.. రాజకీయంగా డెమొక్రాట్లకు మాత్రం పెను విఘాతం తగిలినట్టవుతోంది.
కొడుకు వల్ల..
జో బైడన్ తనయుడు హంటర్ బైడెన్.. తాజా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. పన్ను ఎగవేత కేసులను ఎదుర్కొంటోన్న హంటర్.. తన నేరాన్ని అంగీకరించాడు. న్యాయస్థానం ముందు లొంగిపోయారు. పన్ను ఎగవేత, రిటర్న్‌లను సక్రమంగా దాఖలు చేయకపోవడం వంటి తొమ్మిది కేసుల్లో తనపై వచ్చిన నేరాలన్నింటినీ అంగీకరిస్తూ కోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు.

1.4 మిలియన్ డాలర్లు ఎగవేత..
2016-19 మధ్యకాలంలో హంటర్ బైడెన్ ఏకంగా 1.4 మిలియన్ డాలర్ల మేర పన్నును ఎగ్గొట్టినట్టే ఆరోపణలు ఇదివరకు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన తప్పుడు డాక్యమెంట్లను సమర్పించినట్లు తేలింది. ఆ ఆరోపణలను హంటర్ బైడెన్ గతంలో తోసిపుచ్చారు. తాను సక్రమంగా పన్ను చెల్లించానని, ఐటీ రిటర్న్ప్‌లను ఎప్పటికప్పుడు దాఖలు చేస్తూ వచ్చానంటూ వివరణ ఇస్తూ వచ్చారు.
లాస్ ఏంజిలిస్ కోర్టులో..
ఆయనపై వచ్చిన ఆర్థిక నేరాలపై లాస్ ఏంజిలిస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ అయింది. మొత్తం తొమ్మిది పిటీషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటీషీన్లపై గురువారం విచారణ మొదలైంది. డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి మార్క్ సీ స్కార్సీ బెంచ్.. విచారణ చేపట్టింది. 56 పేజీల తొలి పిటీషన్‌ను చదవటం పూర్తయిన వెంటనే.. హంటర్ బైడెన్ తరఫు అడ్వొకేట్ అబ్బే లోవెల్..నేరాంగీకరణ పిటీషన్ సమర్పించారు.
15 సంవత్సరాల వరకు..
అమెరికా చట్టాల ప్రకారం.. పన్ను ఎగవేత కేసుల్లో హంటర్ బైడెన్‌కు 15 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే మిలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కోవచ్చు. నేరాలను అంగీకరించిన నేపథ్యంలో- ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో తాను ఎలాంటి పొరపాట్లూ చేయలేదంటూ 2023లో కోర్టుకు సమర్పించిన రిపోర్టు ఇక చెల్లదంటూ కోర్టు పేర్కొంది.
ఎన్నికల వేళ..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరుగనున్నాయి. దీనికోసం అధికార డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఈ పరిస్థితుల్లో హంటర్ బైడెన్ ఉదంతం తెర మీదికి రావడం.. డెమొక్రాట్లను ఇబ్బందుల్లో పడేసినట్టయింది.












Click it and Unblock the Notifications