భారీ గండి: ఫ్లోరిడాపై ఇర్మా కోలుకోలేని దెబ్బ, కోట్ల మంది అంధకారంలోనే!
ఫ్లోరిడా కీస్ దీవుల్లో ఇర్మా సృష్టించిన భీభత్సం టూరిజానికి భారీ గండి కొట్టింది.
ఫ్లోరిడా: అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇర్మా తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. హరీకేన్ హార్వీ ధాటికి టెక్సాస్ అతలాకుతలం, ఆ వెంటనే ఫ్లోరిడాపై ఇర్మా విరుచుకుపడటం ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇన్నాళ్లు అమెరికాలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తూ వచ్చిన ఫ్లోరిడా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చితికిపోయింది.
టూరిజం ఆధారంగా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తూ వచ్చిన ఫ్లోరిడాకు ఇర్మా పెద్ద దెబ్బలా పరిణమించింది. ఫ్లోరిడా కీస్ దీవుల్లో ఇర్మా సృష్టించిన భీభత్సం టూరిజానికి భారీ గండి కొట్టింది. అత్యద్భుత పర్యాటక కేంద్రంగా ఉన్న కీస్ కాస్త.. ఇప్పుడు శిథిలాలు, వ్యర్థాలతో అస్తవ్యస్థంగా తయారైంది.
అట్లాంటిక్ సముద్రం, మెక్సికో జలసంధి మధ్యలో 120కి.మీ విస్తరించిన ఈ సుందర దీవులకు దారి కూడా మూసుకుపోయింది. మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చమురు నిల్వలు కరిగిపోయాయి. మూడు ఆసుపత్రులు మూతపడ్డాయి. మొబైల్ ఇళ్లన్ని చెల్లాచెదుయ్యాయని అధికారులు వెల్లడించారు.

తుఫాను భీభత్సానికి ఆ ప్రాంతం వదిలి వెళ్లినవాళ్లంతా ఇప్పుడు తిరిగొస్తున్నారు.నష్టం ఎంతమేర ఉంటుందనే దానిపై ఇంకా అంచనాకు రాలేదని అధికారులు తెలిపారు.కీ వెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇర్మా ఎఫెక్ట్ తో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. 1.3కోట్ల మంది ఇంకా అంధకారంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని వారాలు పడుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఇర్మా హరికేన్ ప్రభావంతో ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారు. సహాయ శిబిరాల్లో ఇప్పటికీ దాదాపు రెండు లక్షల మంది తలదాచుకున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications