• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హార్ట్ టచింగ్: భార్య శవం పక్కన 6రోజులు, అతనేం చేశాడంటే?

|

డెర్బీషైర్: ఏళ్లుగా కొనసాగిన అనుబంధం.. క్షణాల వ్యవధిలో గతించిపోతుందంటే ఎవరికైనా దు:ఖం పొంగుక రాకమానదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరిని కోల్పోతే.. ఆ బాధ మరింత వర్ణనాతీతం. ఒక్కసారిగా ఒంటరైపోయిన ఫీలింగ్ వెంటాడుతుంది.

అప్పటిదాకా తనే లోకంగా బతికిన వ్యక్తి.. చివరి వీడ్కోలు చెప్పడానికి తీవ్ర మానసిక వేదనకు గురవుతాడు. యూరోప్ కు చెందిన రస్సెల్ కు సైతం ఇదే అనుభవం ఎదురైంది. భార్యను అమితంగా ప్రేమించే రస్సెల్.. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ క్రమంలో భార్య శవం పక్కనే ఆరు రోజుల పాటు గడిపి విస్మయానికి గురిచేశాడు.

దీనికి అతగాడు చెబుతున్న సమాధానం వింటే మాత్రం.. ఎవరైనా సరే రసెల్ లాంటి భర్తను కోరుకుంటారనడంలో అతిశయోక్తి లేదేమో!. 'చావు గురించి మాట్లాడాలంటేనే మన సమాజానికి భయం. ఎంత శవంగా మారితే మాత్రం పాతికేళ్లకు పైగా ప్రేమించిన భాగస్వామిని ఒక్కరోజుతో దూరం చేసుకుంటామా?' అని ప్రశ్నించిన రసెల్.. అలా చేయవద్దని చెప్పడానికే తాను భార్య శవం పక్కన ఆరు రోజులు గడిపానని చెప్పాడు.

Husband reveals he slept with his wife’s dead body in their bedroom for SIX DAYS after she lost cancer battle

అయితే శవాన్ని భద్రపరచడానికి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోకపోయినా.. శవం కుళ్లిపోవడం కానీ, దుర్వాసన రావడం కానీ జరగలేదని రసెల్ తెలిపాడు. చట్టప్రకారం మృతదేహాన్ని ఆరు రోజులకు మించి భద్రపరచవద్దన్న సూచనల మేరకు.. ఆరు రోజుల అనంతరం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు.

ఆరు రోజుల పాటు భార్య శవం పక్కన గడిపిన క్షణాలను తలుచుకుంటూ.. సోషల్ మీడియాలో ఒక లేఖను పోస్టు చేశాడు. గౌరవప్రదంగా ఎలా జీవించాలో.. అంతే గౌరవంగా ఎలా మరణించాలో.. నీవు మాకు చూపించావంటూ ఆమె జీవితాన్ని రసెల్ లేఖ ద్వారా గుర్తు చేసుకున్నాడు.

మరో విశేషమేంటంటే.. తన భార్య క్యాన్సర్ తో బాధపడుతుందని, ఇక ఆమె ఎక్కువ రోజులు బ్రతకలేదని రసెల్ కు ముందే తెలుసు. డాక్టర్లు ఆరు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అయితే భార్యను మృత్యు ఆలోచనల నుంచి తప్పించడానికి.. రసెల్ ఓ ప్లాన్ చేశాడు. భార్య కోసం ప్రత్యేకంగా ఓ కారవాన్ కొనుగోలు చేసి యూరోప్ మొత్తం ఆమెను తిప్పాడు.

అలా ఆరు నెలలు బతుకుందనుకున్న రసెల్ భార్య రెండున్నరేళ్లు బతకడం విశేషం. అయితే ఈ ప్రయాణంలో ఓరోజు ఆమెకు సర్వికల్ క్యాన్సర్ నొప్పి తీవ్రం కావడంతో.. ఇంగ్లాండ్ తీసుకొచ్చి రాయల్ డెర్బీ ఆసుపత్రిలో చేర్పించాడు. దీంతో ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూసింది.

అనంతరం భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లి.. మంచంపై పడుకోబెట్టి, తాను కూడా ఆమె పక్కనే పడుకుని ఆరు రోజుల పాటు డిపాడు. ఆ సమయంలో భార్యతో కలిసి అనుభవించిన మధుర క్షణాలను అతను నెమరువేసుకున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A GRIEVING husband who slept next to his wife’s dead body in their bedroom for six days says he couldn’t bear to see her taken off to a mortuary in a bodybag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more