భారతీయురాలినైనందుకు గర్వపడుతున్నా- నిక్కీ హేలీ ఎమోషన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు. తాను భారతీయురాలినైనందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. 2024లో జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నాహాలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు. సౌత్ కరోలినాలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆమె ప్రసంగించారు.

సౌత్ కరోలినాలో..

సౌత్ కరోలినాలో..

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఓ సభలో నిక్కీ హేలీ ప్రసంగించడం ఇదే తొలిసారి. సౌత్ కరోలినా.. నిక్కీ హేలీ సొంత రాష్ట్రం. ఇదివరకు ఈ రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్ గా పనిచేశారు. గతంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. అనంతరం రాజకీయాల్లో అడుగు పెట్టారు. రిపబ్లికన్ పార్టీలో చేరారు. సౌత్ కరోలినా నుంచి రిపబ్లిక్ అభ్యర్థిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ లో విస్తృతంగా పని చేశారు.

 భారతీయురాలినైనందుకు..

భారతీయురాలినైనందుకు..

తాజాగా సౌత్ కరోలినాలో ఏర్పాటు చేసిన సభలో నిక్కీ హేలీ ప్రసంగించారు. తాను భారతీయురాలినైనందుకు గర్వపడుతున్నానని అన్నారు. మరింత మెరుగైన జీవనం కోసం తన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారని, సౌత్ కరోలినాలో స్థిరపడ్డారని అన్నారు. ఇక్కడి ప్రజలు తమను ఎంతో ఆదరించారని చెప్పారు. భారత్ నుంచి వచ్చిన వలసదారుల కుమార్తెగా, ఓ పోరాట యోధుడికి భార్యగా తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

 ట్రంప్ కు పోటీ..

ట్రంప్ కు పోటీ..

2014 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ తరఫున మరోసారి పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాట్లు చేసుకుంటోన్నారు. ఆయనకు తొలి పోటీ దారుగా నిలిచారు నిక్కీ హేలీ. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో నిక్కీ హేలీ గెలవాల్సి ఉంటుంది. ఇందులో గెలిస్తేనే- ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి క్లియరెన్స్ లభించినట్టవుతుంది. అదే ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఈ ఎన్నికలు జరుగుతాయి.

 పంజాబ్ నుంచి వలస..

పంజాబ్ నుంచి వలస..

నిక్కీ హేలీ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పూర్తి పేరు నిమ్రత నిక్కీ రంధవా. ఆమె పూర్వీకులు పంజాబ్ కు చెందినవారు. అమెరికాకు వలస వెళ్లారు. సౌత్ కరోలినాలోని బంబెర్గ్ లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధవా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. తల్లి రాజ్ కౌర్ రంధవా.. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థిని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+