మోదీ మాట్లాడతా: ఇది రిలయలైజేషన్ అంటే

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. ఈ టారిఫ్ అనంతరం అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. చైనా, రష్యాలతో దోస్తీని పెంపొందించుకుంది భారత్. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ఫలితంగా భారత్- అమెరికా సంబంధాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

I look forward to speaking with my friend PM Modi says Donald Trump

ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. భారత్ సంబంధాలు మరింత బలహీనపడొచ్చని భావిస్తోన్న నేపథ్యంలో ఆయన మెత్తపడ్డారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడతానని, తమ రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం చర్చలు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ ను సహజ మిత్ర దేశంగా అభివర్ణించారు.

తాను ఎప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటానని, ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ప్రశంసించారు. ఇరు దేశాల సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. భారత్- అమెరికా స్నేహ సంబంధాలు ఈనాటివి కావాని, వాటిని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రధాని మోదీతో మాట్లాడతానని, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న అడ్డంకులన్నింటికీ విజయవంతమైన ముగింపు ఉంటుందని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గానీ ఈ చర్చలను అధికారికంగా ధృవీకరించలేదు. స్వయంగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించాల్సి రావడం వల్ల చర్చల్లో పురోగతి కనిపించే అవకాశాలు లేకపోలేదు. టారిఫ్ తగ్గింపు, కొన్ని వస్తువులపై మినహాయింపులను కేంద్రం కోరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+