అల్‌ఖైదాకు పని చేశా, నా భార్య పొగిడింది: హెడ్లీ షాక్

ముంబై: పాకిస్తాన్ - అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ మరో బాంబు పేల్చాడు. తాను అల్ ఖైదాకు పని చేసినట్లు చెప్పాడు. వీడియో లింక్ ద్వారా శుక్రవారం నాడు ముంబై కోర్టు నిర్వహించిన విచారణలో హెడ్లీ పాల్గొన్నాడు. నాలుగో రోజు కోర్టు అతనిని విచారించింది.

ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీపై గతంలో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ముంబై దాడులను విజయవంతంగా చేపట్టినందుకు తనను మెచ్చుకుంటూ తన భార్య ఈ-మెయిల్ పంపినట్లు తెలిపాడు. 2008 నవంబర్ 28న తనకు ఆ మెయిల్ వచ్చిందన్నాడు.

I used to work for al Qaeda as well, admits David Headley

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు అని, సంబరాలు ఘనంగా జరిగాయని తన భార్య ఫైజా మెయిల్ చేసిందని హెడ్లీ చెప్పాడు. తద్వారా ముంబై దాడుల విషయం తన భార్యకు ముందే తెలుసునని అతను చెప్పాడు.

ఇక తనతో విడాకులు తీసుకున్న ఫైజా... తిరిగి తమను కలపమని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అభ్యర్థించిందని, ఈ విషయంలో సయీద్ తనతో మాట్లాడాడని డేవిడ్ హెడ్లీ తెలిపాడు. ముంబై దాడులకు డైరెక్షన్స్ కరాచీ నుంచి వచ్చాయని చెప్పాడు. కాగా, తాను నావల్ స్టేషన్, సిద్దివినాయక ఆలయంపై దాడి జరగకుండా ఆపానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+